ఇన్నాళ్లకు ఒకటైన రజినీకాంత్, సత్యరాజ్.. అసలు వీరి గొడవకు కారణం ఏంటంటే..?!

స్టార్ హీరో రజనీకాంత్.. సీనియర్ యాక్టర్ సత్యరాజ్ మధ్యన చాలాకాలంగా మాటలు లేవు.. అయితే తాజాగా వారిద్దరు ఒకటయ్యారంటు తెలుస్తుంది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్‌ తెరకెక్కిస్తున్న కూలి సినిమా కోసం 30 ఏళ్ల తర్వాత వీరిద్దరూ క‌ల‌వ‌నున్నార‌ట‌. ఈ సినిమాలో వీరిద్ద‌రు మ‌ళ్ళీ క‌లిసి న‌టిస్తున్నార‌ని తెలుస్తుంది. చివరిసారిగా వీరిద్దరూ ‘ మిస్టర్ భరత్ ‘ లో తండ్రి, కొడుకులుగా మెప్పించారు. అయితే 1986లో కావేరి జలవివాదం సందర్భంగా సత్యరాజ్ మాట్లాడుతూ రజనీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

What is the issue between Rajinikanth and Sathyaraj ? - Sibiraj finally  opens up - Tamil News - IndiaGlitz.com

దీంతో వీరిద్దరి మధ్యన మనస్పర్ధలు మొదలై మాట్లాడుకోవడం మానేశారు. ఆ గొడవల కారణంగా అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సీనియర్ స్టార్స్ ఇద్దరు ఒకరితో ఒకరు నటించలేదు. అయితే తాజాగా వీళ్ళిద్దరిని ఒప్పించి కూలి సినిమాలో నటించేలా ప్లాన్ చేశాడు లోకేష్ కనగ‌రాజ్‌. ఇందులో సత్యరాజ్ రజినీకాంత్ స్నేహితుడిగా స‌త్య‌రాజ్ కనిపించనున్నాడని టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. అయితే ఇదే సినిమాలో కమల్ హాసన్ గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Sathyaraj to reunite with Rajinikanth after 38 years in Coolie?

ఈ సినిమాలో రజనీకాంత్ కి జోడిగా హీరోయిన్ శోభన నటిస్తుంది. గోల్డ్ స్మగ్లింగ్ కథాంశంతో రజినీకాంత్ హీరోగా.. లోకేష్ కనగ‌రాజ్ ఈ సినిమా తెర‌కెక్కిస్తుండడంతో ఫ్యాన్స్ లో మంచి అంచనాలు మొదలయ్యాయి. ఇక తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, గ్లింప్స్‌ ప్రేక్షకులను భారీ లెవెల్ లో ఆకట్టుకోవడంతో.. సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల్లో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.