మరోసారి రవితేజ, శ్రీ లీలా కాంబో రిపీట్.. ఈసారి ‘ ధమాకా ‘ మించిన బ్లాక్ బస్టర్ పక్కా.. డైరెక్టర్ ఎవరంటే..?!

మాస్ మహారాజ్ రవితేజ 75వ సినిమా ఇప్పటికే ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. దర్శకుడు భాను భోగావరపు తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు రిలీజ్ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు మూవీ టీం సిద్ధమవుతున్నారు.

Ravi Teja: చాన్నాళ్ల తర్వాత రవితేజకు హిట్ | Ravi Teja gets big success with  Dhamaka song

ప్రస్తుతం పూర్వ నిర్వాణ పనుల్లో ఉన్న ఈ సినిమా వచ్చే నెల నుంచి సెట్స్‌ పైకి రానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మిగిలిన కాస్టింగ్ అంతా సెలెక్ట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు మూవీ టీం. ఇందులో భాగంగా రవితేజకు జోడిగా శ్రీ లీలను సెలెక్ట్ చేసుకుంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే మూవీ టీం ఆమెతో సంప్రదింపులు జరిపారని.. ఆమె సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ తెలుస్తోంది.

Ravi Teja's next film announced with Sithara Entertainments

త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. శ్రీలీల ఇప్పటికే రవితేజతో కలిసి ధమాకా సినిమాలో నటించి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో శ్రీ‌లీల ఓవ‌ర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించే వరుస అవకాశాలను అందుకుని క్రేజీ బ్యూటీగా పాపులారిటీ దక్కించుకుంది. ఇక మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ అవుతుంద‌ని తెలియ‌ట్తో కచ్చితంగా ధమాకా ను మించిన బ్లాక్ బస్టర్ పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.