రేణు దేశాయ్.. ఈ మధ్యకాలంలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న పేరు . అఫ్కోర్స్ అంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య గా కూడా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది . కానీ ఆయన విడాకులు ఇచ్చేసిన తర్వాత సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ ఎదురుకుంది రేణు దేశాయ్ . అంతేకాదు రేణు దేశాయ్ ఏ పోస్ట్ పెట్టిన సరే దాన్ని కొందరు పెడార్ధంగా తీసుకుని ట్రోల్ చేస్తూ ఉంటారు.
రీసెంట్గా రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్స్ షేర్ చేయడం సంచలంగా మారింది . దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . విడాకుల తర్వాత సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ఇటీవల రేణు దేశాయ్ నెటిజెన్లు డబ్బులు అడగడంతో వారు సహాయం చేశారు . దానికి సంబంధించిన స్క్రీ షాట్స్ కూడా షేర్ చేసింది.
“తాను సహాయం చేయడానికి సోర్స్ ఏంటో తెలుపుతూ ఫోటోలు పెట్టింది.. నేను ఎప్పుడూ ఇలాంటి విషయాలు బయట పెట్టలేదు .. కానీ నన్ను నమ్ముతూ డబ్బులు సహాయం చేస్తున్నవారికి ఈ విషయం తెలియాలి కాబట్టి ఇలా ఫోటోలు షేర్ చేస్తున్నాను అని రాసుకోచ్చింది”. కాగా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎక్కువగా యానిమల్ కి సంబంధించిన పోస్ట్లు పెడుతూ ఉంటుంది. తన ఫాలోవర్స్ ను డబ్బులు అడిగి అలాగే తన దగ్గర ఉన్న మనీతో జంతువులకు చిన్నారులకు సహాయం చేస్తుంది . పెట్స్ కి సంబంధించి వీడియోలు కూడా షేర్ చేస్తూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది..!