“నోరు మూయండి రా వెధవల్లారా..?” కోపంతో ఊగిపోయిన వేణు స్వామీ ..సెన్సేషనల్ కామెంట్స్..!!

వేణు స్వామి .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఈ మధ్యకాలంలో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . స్టార్ సెలబ్రిటీస్ ల లైఫ్ లో జరగబోయే విషయాలను ముందుగానే అభిమానులకి చెప్పేస్తూ కొన్నిసార్లు పొగిడించుకుంటూ మరికొన్నిసార్లు తిట్టించుకుంటూ వచ్చారు . మరీ ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి వేణు స్వామికి అస్సలు పడదు . రీజన్ ఏంటో తెలియదు కానీ ప్రభాస్ గురించి వేణు స్వామి ఏమి చెప్పినా రెబెల్ ఫ్యాన్స్ నమ్మరు.

అయితే గతంలో వేణు స్వామి ప్రభాస్ గురించి మాట్లాడుతూ ..”ఆయన నటించే సినిమాలు ఫ్లాప్ అవుతాయని .. ఆయనను నమ్మి ఒక రూపాయి ఇన్వెస్ట్ చేయడం కూడా వేస్ట్ అన్న విధంగా కామెంట్స్ చేశారు “. అంతేకాదు ఇప్పుడు అదే పాయింట్ను పట్టుకొని సలార్ సినిమా హిట్ అయిన తర్వాత వేణు స్వామిని కొందరు రెబెల్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు . దీనితో కోపంతో ఊగిపోయిన వేణు స్వామి అలాంటి వాళ్లకు ఇచ్చి పడేశారు.

గతంలో సలార్ సినిమాపై చేసిన కామెంట్స్ కు రిప్లై ఇస్తూ..” ఒరేయ్ ఆస్ట్రేలియా ఆజాము సూపర్ స్టార్ అంటే విడుదలైన సినిమాలలో 90% సినిమాలు హిట్లు కొట్టడం.. అంతేకానీ నాలుగు సినిమాల్లో ఒక సినిమా హిట్ కొడితే ఏమంటారు రా ఆజాము.. నాలుగు సినిమాలకి ఒక్క సినిమా హిట్ కొట్టడం కాదురా ఆజాము ఆస్ట్రేలియా “అంటూ వ్యంగ్యంగా విరుచుకుపడ్డారు . అంతేకాదు ప్రభాస్ విషయంలో నేను చెప్పినవి కొన్ని బయటకు వస్తున్నాయి .. కొన్ని రావట్లేదు.. ఆయనకు ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నాయి . సర్జరీ కూడా చేయించుకున్నాడు. ఆ విషయం బయటకు రావడం లేదు . ప్రభాస్ గురించి నేను చెప్పిందే నిజం. మీకేం తెలుసురా వెధవల్లారా ప్రభాస్ కి ఉన్న సమస్యల గురించి “అంటూ వేణు స్వామి కౌంటర్ ఇచ్చారు .

దీంతో వేణు స్వామి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు వేణు స్వామి ఫ్యాన్స్ కూడా రెబెల్ ఫాన్స్ కు ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు “ఇక నైఅన్ నోరు మూయండి వెధవల్లారా” అంటూ వేణు స్వామి అభిమానులు రెబల్ ఫ్యాన్స్ పై విరుచుకుపడుతున్నారు..!!