ఎస్ ప్రెసెంట్ ఇదే సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న ఐకాన్ హీరో అల్లు అర్జున్ లేడీ పవర్ స్టార్ గా పాపులారిటీ దక్కించుకున్న సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . కేవలం సౌత్ లోనే కాకుండా ఇండియా వైడ్ గా వీళ్ళు పాపులారిటీ దక్కించుకున్నారు . మరీ ముఖ్యంగా బన్నీ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు.
పుష్ప సినిమాకు గాను ఏకంగా జాతీయ అవార్డు అందుకొని తన పేరుని మారుమ్రోగిపోయేలా చేసుకున్నారు. రీసెంట్గా హైదరాబాద్ రేపర్ అయిన కేథన్ శర్మ బాలీవుడ్ లోని ప్రముఖ టీవీ ఛానల్ మ్యూజిక్ షో లో ఒక పర్ఫామెన్స్ ఇచ్చారు. ఆ సాంగ్లో హైదరాబాద్ కల్చర్ సిటీ గొప్పతనాన్ని .. ఇక్కడి వీధుల్లో చిరు వ్యాపారుల రోజు వారి జీవితాన్ని తెలియజేస్తూ పాటను మొదలుపెట్టాడు .
పాట మధ్యలో అల్లు అర్జున్ – సాయి పల్లవి ల గురించి కూడా మాట్లాడుతూ పాట పాడాడు . “అల్లు అర్జున్ డాన్స్ అంటే అందరికీ ఇష్టం ..స్టైలిష్ స్టార్ అందరూ అంటారు అతనిని తగ్గేదెలా ..మేము పుష్ప ఫాన్స్ “అనే లిరిక్స్ తో పాడాడు. సాయి పల్లవి గురించి మాట్లాడుతూ ..”పాట పాడుతూ అందాలు ఆరబోసే హీరోయిన్స్ ఉంటారు ..కానీ సాయి పల్లవి సింప్లిసిటీ పాపులారిటీ ఎవరికి రాదు అంటూ ఓ రేంజ్ లో ఊపేశాడు . ఈ పాట ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది”.
అల్లు అర్జున్-సాయి పల్లవి పై గూస్ బంప్స్ తెప్పించే రాప్ సాంగ్ విన్నారా.. అద్దిరిపోయిందంతే..!
