దసరా ” స్పెషల్ ” వీడియో షేర్ చేసిన బోల్డ్ బ్యూటీ అన‌సూయ‌.. బ్యాక్ పెయిన్ వస్తుందా ఆంటీ.. అంటూ ట్రోల్స్…!!

అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా దూసుకుపోతుంది. అంతేకాకుండా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అప్డేట్స్ మొత్తం అభిమానులతో పంచుకుంటుంది. వేసుకునే డ్రస్సులకు, పోస్టులకు ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఏ మాత్రం పట్టించుకోని యాంకర్.. తన అందాలతో నెట్టింట హల్ చల్ చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే మరోసారి వర్కౌట్స్ అందాలు పంచుకుంది.

అంతేకాకుండా.. ఆ పోస్టుకు అదిరిపోయే క్యాప్షన్ ఇస్తూ ” ఈ దసరా..చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకోండి..సోమరితనంపై చేతి పనుల విజయాన్ని జరుపుకోండి. సందేహ భయంపై దృష్టి, నిబద్ధత, అంకిత భావన విజయాన్ని జరుపుకోండి ” అని చెబుతూనే ” ప్రజలు ఏమి చెప్పినా.. నీకిప్పుడు అవసరమా ఆంటీ ” .. 35 దాటిన ఎందుకు ఇవన్నీ.. ఇంట్లో పిల్లల్ని చూసుకోవచ్చు కదా ” ఇలా అనేక రకాలుగా మన స్వాతంత్రాన్ని బయటపెడుతున్నారు.

మనం మనమే నేర్చుకుంటే మన మీదే దృష్టి పెడతారేమో అని భయపడ్డతారు. క్షేమం మాకు వారి అవసరం లేదు. మీపై మీరు దృష్టి పెట్టండి. మీరు ఆరోగ్యంగా ఉండడానికి అర్హులు. మీరు సంతోషంగా ఉండడానికి అర్హులు. మీరు కోరుకునే ప్రతి దానికి మీరు విలువైన వారు. తనలో పరివర్తనను మేల్కొల్పుకునే ప్రతి స్త్రీ కాళి.. దసరా శుభాకాంక్షలు ” అంటూ చెప్పుకొచ్చింది. అయినప్పటికీ తనపై ట్రోల్స్ ఆగలేదు. ఈ వయసులో మీకు అవసరమా అంటూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.