అనవసరంగా అలా మాటలు అంటే ఎవరికైనా మండుతుంది.. బిగ్‌బాస్ పూజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…!!

బిగ్ బాస్ 7 నుంచి ఎలిమినేట్ అయినా ప్రతి ఒక్కరూ గీతూ రాయల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బజ్ లో ఓ ఇంటర్వ్యూ ఇస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే గీతు దరిద్రం ఏంటో కానీ ఆమె ఇప్పటివరకు ఒక అబ్బాయిని కూడా ఇంటర్వ్యూ చేయలేదు. ఎందుకంటే ఏడు వారాల్లో ఇప్పటివరకు అందరూ అమ్మాయిలే ఎలిమినేట్ అయ్యారు. ఇక ఏడో వారం పూజ మూర్తి ఎలిమినేట్ అయింది. ప్రోమో మొదట్లోనే మీకు రెండు ఎలిమినేషన్స్ పడ్డాయి.

దీంట్లో ఏది తుప్పాస్‌ నామినేషన్ అని మీకు అనిపిస్తుంది అని గీతు అడిగింది. అప్పుడు పూజ, తేజ ఫోటోను చింపేస్తూ వీడు చెప్పింది తుప్పాస్‌ రీజన్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన మీరు చాలా వైల్డ్ గా ఆడతారని మేమంతా అనుకున్నాం అని గీతూ అంది. అయ్యె నాకు దెబ్బ తగులుతుంది.. నాకు నొప్పిగా ఉందనే ఆడపిల్లలు కేవలం టీవీ చూసుకుంటూ ఇంట్లోనే కూర్చోవాలి.. ఇట్లాంటి వాటికి రాకూడదు.. అని గట్టిగా సమాధానమిచ్చుకుంది పూజ.

మిగిలిన వాళ్లు మీ కంటే హౌస్ లో ఉండటానికి అర్హులని మీరు అనుకుంటున్నారా అని గీతూ ప్రశ్నించగా.. అశ్విని, భోలె అర్హులు కాదని పూజ సమాధానమిచ్చింది. రీజన్ ఏంటని అడిగితే..ఎవరో నిన్ను పైనుంచి కింద వరకు చూసి ఆ నువ్వు ఫిజికల్లీ స్ట్రాంగె నాకు తెలుసు అన్నప్పుడు ఎవరికైనా కాలుతుంది. ఎవరికైనా చిరాకు వస్తుంది అంటూ పూజ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం పూజ మూర్తి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.