కోలీవుడ్ హీరో విజయ్ దళపతి హీరోగా నటించిన తాజా చిత్రం లియో .ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ గా త్రిష నటిస్తూ ఉండగా అర్జున్, సంజయ్ దత్ విలన్గా నటించారు. అక్టోబర్ 19వ తేదీన చాలా గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా ఎంతో హైట్ తో విడుదలై ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.టాక్ ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమా కలెక్షన్స్ పరంగా భారీగానే సాధించినట్లు తెలుస్తోంది.
LCU పేరుతో డిఫరెంట్ మూవీగా తెరకెక్కించారు గతంలో ఖైదీ, విక్రమ్ సినిమాలు విడుదల కావడం జరిగింది. వీటిని లింకు చేస్తూ లియో సినిమా థియేటర్లో విడుదల కావడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. ముఖ్యంగా టేకింగ్ విషయంలో సూపర్ అనిపించుకున్న ఈ సినిమా కథ కథనాలు విషయంలో మాత్రం కాస్త ఫెయిల్యూర్ గా నిలిచిందని పలువురు నెటిజన్స్ సైతం తెలుపుతున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటి హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా థియేటర్లో విడుదలైన నెల రోజులలోనే స్ట్రిమింగ్ చేసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా లియో సినిమా ఓటీటి రిలీజ్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 19వ తేదీన థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా నవంబర్ 21న ఓటీటి లో స్ట్రిమింగ్ కాబోతున్నట్లు సమాచారం త్వరలోనే ఈ విషయం పైన అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.