కొత్త కారు కొన్న పూజ హెగ్డే.. ధర తెలిస్తే షాక్..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు పొందిన పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. ఈ మధ్యకాలంలో సరైన అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్ వైపుకు వెళ్లి అక్కడ తన హవా కొనసాగించాలని పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్న అవన్నీ పెద్దగా వర్కౌట్ కాలేకపోతున్నాయి. త్వరలోనే షాహిద్ కపూర్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే మాల్దీవ్ ట్రిప్పుల్లో ఎంజాయ్ చేస్తూ గ్లామర్ ని వోలకబోసిన పూజా హెగ్డే తన పుట్టినరోజు వేడుకలను కూడా చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంది.

తాజాగా పూజా హెగ్డే ఒకసారి కొత్త కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దసరా పండుగ సందర్భంగా లగ్జరీ కారునుకోన్న ఈ ముద్దుగుమ్మ రేంజ్ రోవర్ కి చెందిన..SUV మోడల్ కారును తీసుకున్నట్లు తెలుస్తోంది.అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సైతం షేర్ చేయడం జరిగింది పూజ హెగ్డే. ముంబైలో కొత్త కారు నుంచి ఆమె దిగుతూ ఉండగా కెమెరా కంటికి చిక్కడంతో దీంతో కారు ముందు ఆమె కెమెరా లకు ఫోజులు ఇవ్వడం జరిగింది. చాలా సాంప్రదాయమైన దుస్తులలో ధరించిన పూజా హెగ్డే బ్లూ అనార్కలి డ్రస్సులు అందరిని ఆకట్టుకుంది.

Pooja Hegde buys a swanky new Range Rover SV worth INR 4 crore on Dussehra

పూజా హెగ్డే కొన్న ఈ కారు ధర 4 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం..SV లైనప్ లో ఉండే టాప్ మోడల్ ని సైతం ఇమే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫుల్ లగ్జరీ ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ఈ కారులో ఉన్నట్లు సమాచారం. పెట్రోల్ ఇంజన్ శక్తివంతమైన మోటార్ను ఈ రేంజ్ రోవర్ ఎస్వీ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారు గరిష్టంగా గంటకు 234 కిలోమీటర్లు ప్రయాణిస్తుందట. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఎలాంటి సినిమాలు లేవు.