సాధారణంగా హీరోలు ఏదైనా షర్ట్, వాచ్, షూస్ వంటివి ధరించినప్పుడు.. అలాంటివి వేసుకోవాలని అభిమానులు తహతహలాడుతుంటారు. ఈ క్రమంలోనే `గుంటూరు కారం` తాజా పోస్టర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ధరించిన షర్ట్ ను సొంతం చేసుకునేందుకు ఆయన అభిమానులు నెట్టింట సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఆ షర్ట్ కాస్ట్ చూసి.. వారికి ఫ్యూజులు ఎగిరిపోయాయి.
నిన్న మహేష్ బాబు బర్త్డే. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రం `గుంటూరు కారం` నుంచి ఓ కొత్త పోస్టర్ బయటకు వచ్చింది. అందులో మహేష్ లుంగీ షర్ట్ ధరించి.. కళ్లకు గ్లాసెస్ పెట్టుకుని.. బీడీ కాలుస్తూ మాసీ లుక్ లో దర్శనమిచ్చారు. అయితే ఈ పోస్టర్ మహేష్ బాబు షర్ట్ ఫ్యాన్స్ ను బాగా ఆకర్షించింది. వెంటనే గూగుల్ లో ఆ షర్ట్ కోసం సెర్చింగ్ షురూ చేశాడు.
అప్పుడే వారికి పెద్ద షాక్ తగిలింది. మహేష్ బాబు ధరించిన ఆ షర్ట్ ఏ 5 వేలో లేక 10 వేలో ఉంటుందని ఫ్యాన్స్ భావించారు. కానీ, ఆ షర్ట్ కాస్ట్ అక్షరాల రూ. 74,509. మహేష్ బాబు గుంటూరు కారం తాజా పోస్టర్ లో ఆర్13 బ్లీచ్ వాష్ ప్లాయిడ్ లాంగ్ స్లీవ్ షర్ట్ ధరించారు. ఈ షర్ట్ మీ సొంతం కావాలంటే.. అకౌంట్ లో రూ. 74,509 ఉంటే చాలు. ఏదేమైనా ఒక్క షర్ట్ కోసం అంత ఖర్చు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. నెటిజన్లు `ఓరి దేవుడోయ్.. మహేష్ షర్ట్ అంత కాస్ట్లీనా..?` అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు అభిమానులు మాత్రం సూపర్ స్టార్ అంటే ఆ మాత్రం ఉండాలని చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు.