ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల హవా ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. అటు టాప్ స్టార్స్ దగ్గర నుంచి ఈ యంగ్ హీరోల వరకు అందరికీ శ్రీలీల వన్ ఆఫ్ ది ఆప్షన్ గా మారింది. అగ్ర హీరోయిన్లు ఎంత మంది ఉన్నాసరే అందరి చూపులు శ్రీలీలపైనే ఉన్నాయి. ఇప్పటికే ఈ బ్యూటీ చేతిలో దాదాపు పది ప్రాజెక్ట్ లు ఉన్నాయి అంటే ఆమె ఎంత బిజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వచ్చిన రెండేళ్లకే టాలీవుడ్ ను తన కనుసైగలతో శాసిస్తున్న శ్రీలీల వద్దకు ఇటీవల మరొక ప్రాజెక్ట్ వచ్చిందట. ఓ యువ దర్శకుడు శ్రీలీలను కలిసి ఓ కథ వినిపించాడట. అయితే కథ విన్న వెంటనే శ్రీలీల తాను ఈ ప్రాజెక్ట్ చేయలేనని చెప్పేసిందట. ఎందుకంటే, అదొక బోల్డ్ సబ్జెక్ట్ ఉన్న కథ అట. హీరోయిన్ రోల్ కూడా చాలా బోల్డ్ గా ఉంటుందట.
అందుకే శ్రీలీల నో చెప్పిందట. అయితే సదరు దర్శకుడు మాత్రం శ్రీలీల నో చెప్పినా సరే వదలకుండా ఫోర్స్ చేయబోయాడట. ఈ ప్రాజెక్ట్ కు మీరే పర్ఫెక్ట్ అంటూ భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశాడట. దాంతో శ్రీలీలకు చిర్రెత్తుకొచ్చిందట. ఎంత డబ్బు ఇచ్చినా చస్తే ఈ ప్రాజెక్ట్ చేయనంటూ సదరు డైరెక్టర్ కు స్ట్రోంగ్ వార్నింగ్ ఇచ్చిందట. సినిమాల విషయంలో తనకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయని.. వాటిని ఎట్టిపరిస్థితుల్లో బ్రేక్ చేయనని తెగేసి చెప్పిందట. ఒకవేళ ఆ రూల్స్ ను బ్రేక్ చేయాల్సి వస్తే నటించడమే మానేస్తానని.. అంతే తప్పా మనసుకు ఇష్టంలేని పని కోట్లు ఇచ్చినా చేయనని శ్రీలీల చెప్పిందని ఇండస్ట్రీలో వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.