సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు సుపరిచితమే.. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలతో కలిసి ఎన్నో చిత్రాలు నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ భాషలలో ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.2021 లో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు నీ ప్రేమించి మరి వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఏడాదికి ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వివాహం తర్వాత హీరోయిన్స్ కు అవకాశాలు రావన్నది ఒకప్పటి మాట కానీ ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది.
ఎంతోమంది హీరోయిన్స్ సైతం వివాహమైన తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నయనతార, సమంత ఇలా అవకాశాలు అందుకుంటూ ముందు వరుసలో ఉన్నారు. ఇప్పుడు కాజల్ అగర్వాల్ ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేయని కాజల్ అగర్వాల్ ఇప్పుడు అలాంటి వాటిలో నటించడంతో కాస్త అభిమానులు ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. కమర్షియల్ సినిమాతోనే కాజల్ అగర్వాల్ స్టార్ క్రేజీను సంపాదించుకుంది. తన కెరీర్లో ఎప్పుడు కూడా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించలేదు..
అందుకే కాజల్ అగర్వాల్ కి ఈ మధ్యకాలంలో అవకాశాలు తగ్గాయని సమాచారం.రెమ్యూనరేషన్ విషయంలో కూడా భారీగా తగ్గించేసిన కాజల్ అగర్వాల్ కి ఆఫర్లు మాత్రం రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు సినిమాకి రూ.4 కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేసేది.. కానీ ఇప్పుడు సగానికి సగం తగ్గించిన కూడా అవకాశాలు రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తనకు కథ నచ్చితే మరింత రెమ్యూనరేషన్ తగ్గించుకోనైనా నటిస్తానని చెప్పిన దర్శకనిర్మాతలు రిస్క్ ఎందుకని ఇతర హీరోయిన్ల దగ్గరకు వెళుతున్నారని ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతం ఇమే ఇండియన్-2 చిత్రంతోపాటు బాలకృష్ణ భగవంత్ కేసరి చిత్రంలో నటిస్తోంది.