శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన నటి ఈషా రెబ్బా. హ్యాపీ డేస్ సినిమా తరువాత శేఖర్ కముల డైరెక్ట్ చేసిన సినిమా లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా యావరేజ్ టాక్ సంపాదించుకుంది. ఆ తరువాత ఈషా ‘ అంతకు ముందు ఆ తరువాత ‘ సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి టాజ్ సంపాదించుకుంది. అలానే ఆమి తుమి, ఆ సినిమాలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది.
అయితే ఈషాకి హీరోయిన్గా మాత్రం మంచి గుర్తింపు రాలేదు. దాంతో అరవింద సమెత, వీర రాఘవ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అయితే ఆ రెండు సినిమాలు విజయం సాధించినప్పటికి ఈశ కు మాత్రం ఎటువంటి గుర్తింపు దక్కలేదు. ఆ అమ్మడు తెలుగులో చివరిగా నటించిన సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’. మన తెలుగు డైరెక్టర్లు ఎలాగో ఆమెని పట్టించుకోవడం లేదని పక్క ఇండస్ట్రీలపై కన్నేసింది.
అవకాశాల కోసం ఈషా సోషల్ మీడియాలో గ్లామర్ పంట పండిస్తుంది. అంతేకాకుండా అందాలు అరబోస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ గ్లామర్ రోల్స్ కి కూడా సిద్ధమే అంటూ కామెంట్స్ పెడుతుంది. తాజాగా ఈ అమ్మడు జిమ్ ఫిట్ లో తన ఒంటిపై ఉన్న జాకెట్ విప్పేసి మరీ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. టైట్ డ్రెస్ లో ఆమె అందాలు చూసి కుర్రాళ్లు వెరెక్కి పోతున్నారు. ప్రస్తుతం ఈషా అందాల ఆరాబోత ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.