టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వీట్ అండ్ క్యూల్ కపుల్స్ లిస్ట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి జంట ఒకటి. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. 2011 మే 5న వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వ్యాపారవేత్త నార్ని శ్రీనివాసరావు కుమార్తెనే లక్ష్మి ప్రణతి. చదువు పూర్తైన వెంటనే ఆమె ఎన్టీఆర్ తో ఏడడుగులు వేసింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు.
కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే హీరోల్లో ఎన్టీఆర్ ముందు వరసలో ఉంటాడు. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సరే భార్య, పిల్లలతో సరదగా గడుపుతుంటారు. అలాగే తరచూ ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాడు. ఇకపోతే నేడు లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకి బర్త్ డే విషెస్ చెప్పాడు తారక్.
భార్యతో దిగిన ఓ పిక్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ `హ్యాపీ బర్త్ డే అమ్ములు` అని తెలిపారు. అయితే విషెష్ సింపుల్‌గానే చెప్పినా, ఓ సీక్రెట్ ను బయటపెట్టాడు. ఇంట్లో భార్యని ముద్దుగా ఏమని పిలుస్తాడో వెల్లడించాడు. ప్రణతిని ముద్దుగా అమ్ములు పిలుస్తాడనే విషయం బయటపడటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా, ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్ తో ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది.
https://www.instagram.com/p/CqOSBmXyhxu/?utm_source=ig_web_copy_link