డీప్ నెక్ జాకెట్‌లో సమంత అందాల ప్రదర్శన.. బోల్డ్ యాటిట్యూడ్‌తో అంతా షాక్..

సమంత పేరు వినగానే అందరికీ ‘ఏ మాయ చేశావే’ సినిమా గుర్తొస్తుంది. అందులో చీర కట్టుకుని, స్లో మోషన్‌లో ఆమె నడిచి వచ్చే తీరును అందరికీ విపరీతంగా నచ్చేసింది. ఇలా ఎన్నో సినిమాలలో పద్ధతిగా ఉండే సమంతను చూసి అభిమానులు ఆమెను ఆరాధించడం ప్రారంభించారు. అడపాదడపా గ్లామరస్ పాత్రలు ఆమె చేసినా ఎప్పుడూ హద్దులు దాటలేదు. ఇక నాగచైతన్యతో ప్రేమ, వివాహం, విడాకుల తర్వాత ఆమె స్టైల్ పూర్తిగా మారిపోయింది. పుష్ప సినిమాలో ఏకంగా స్పెషల్ సాంగ్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆమె నటించిన ‘ఊ అంటావా మావ’ పాట ఓ రేంజిలో ప్రస్తుతం దేశమంతటా మార్మోగుతోంది. కురచ దుస్తుల్లో ఆమె వేసిన స్టెప్పులకు అంతా మైమరిచిపోయారు. ఇక మయోసైటిస్ బారిన పడిన ఆమె అనారోగ్యం పట్ల అభిమానులు ఆందోళన చెందారు. దాని నుంచి కోలుకుంటున్న సమంత ప్రస్తుతం వివిధ సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటోంది.

సమంత నటించిన యశోద సినిమా పౌరాణిక చిత్రం. దీని ప్రమోషన్లకు సమంత ఉల్లి పొరలాంటి చీర ధరించి వచ్చింది. ఆ చీర ఆమె అందాలను దాచలేకపోయింది. ఇదే కాకుండా డీప్ నెక్ జాకెట్ ధరించింది. అందులో ఆమె ఎద అందాలు కనిపిస్తున్నాయి. ఇలా తన బోల్డ్ లుక్, యాటిట్యూడ్‌తో అందరినీ ఆమె ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవల కాలంలో సమంత ధరిస్తున్న డ్రెస్‌లను కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఆమె ఏ డ్రెస్ చేసుకున్నా, అది గ్లామరస్‌గా ఉంటుండడంతో అవి సమంతకు నప్పలేదని కామెంట్లు చేస్తున్నారు.

నలుగురిలోకి వచ్చినప్పుడు ఇలాంటి డ్రెస్‌లు వేసుకుంటావా అని అసభ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే వారిని సమంత పట్టించుకోవడం లేదు. ఆమెకు మద్దతుగా నిలుస్తున్న వారు కూడా ఉన్నారు. ఆమె ధరించిన దుస్తులు ఆమెకు సౌకర్యంగా ఉన్నప్పుడు, విమర్శించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.