గత రెండు రోజుల నుంచి మంచు బ్రదర్స్ విభేదాలు మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. `నా వాళ్ళ మీద విష్ణు దాడి చేస్తున్నాడు. ఇదీ సిట్యుయేషన్` అంటూ అన్న మీద ఆరోపణలు చేస్తూ మనోజ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన వీడియో సంచలనంగా మారింది. దాంతో అన్నదమ్ముల విభేదాలు కాస్త రోడ్డున పడ్డాయి.
అయితే అది చిన్న గొడవ అంటూ విష్ణు వివరణ ఇచ్చారు. అయినా సరే మంచు బ్రదర్స్ వివాదంపై అటు ప్రధాన మీడియాతో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో మోహన్ బాబు తన సపోర్ట్ విష్ణుకే అని చెప్పి మనోజ్ కి బిగ్ షాక్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో ఇప్పటి కాదులేండి. చాలా పాతది.
గతంలో టాలీవుడ్ సెలబ్రిటీ లీగ్ జరిగింది. అందులో విష్ణు, మనోజ్ రెండు టీమ్స్ కి ప్రాతినిధ్యం వహించారు. అప్పుడు మీరు ఎవరి వైపని మోహన్ బాబుని అడగ్గా.. నేనెప్పుడూ ధర్మం, న్యాయం వైపే ఉంటాను. నిజంగా ఇక్కడ కష్టపడింది విష్ణు టీమ్. మనోజ్ టీమ్ కాదు.. అన్నారు. మోహన్ బాబు కామెంట్స్ ని ఖండిస్తూ నటుడు బ్రహ్మానందం స్టేడియం లో కామెడీ చేశారు. ఇది అన్యాయం అంటూ ధ్వజమెత్తారు. మంచు బ్రదర్స్ విభేదాలు బట్టబయలు అవ్వడంతో ఒకప్పటి ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
https://www.instagram.com/reel/CpPBWN7pem9/?utm_source=ig_web_copy_link