నాని దసరా.. చిత్రానికి సెన్సార్ షాక్..!!

హీరో నాని నటిస్తున్న మోస్ట్ అవాయిడ్ చిత్రం దసరా. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నారు ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తూ ఉండగా కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమాని భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు ఈనెల 30వ తేదీన అన్ని భాషలలో ఒకేసారి విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సెన్సార్ నుంచి మాత్రం ఈ చిత్రానికి గట్టి షాక్ ఎదురైనట్లుగా తెలుస్తోంది.

Censor Board conditions on Nani Dasara movie | దసరాకు సెన్సార్ కండీషన్స్..  సినిమాలో కట్ చేసిన సీన్స్ ఎన్నో తెలుసా..?– News18 Telugu
ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాకు కట్స్ విధించడంతో ప్రస్తుతం ఈ విషయంలో దసరా మూవీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతోంది. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు మొత్తంగా 36 కట్స్ తో పాటు కొన్ని బూతు పదాలను కూడా మ్యూట్ చేయాలని అలాగే ధూమపానం మద్యపానం నిషేధిత సంబంధించి వచ్చే సన్నివేశాలను కూడా పెద్ద సైజులో చూపించాలని సూచించినట్లు తెలుస్తోంది. హింసాత్మక సన్నివేశాలను సిజితో కవర్ చేయాలని సూచిస్తూ చిత్రానికి UAE సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. వాస్తవానికి ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తూ ఉంటే ఈ సినిమా A సర్టిఫికెట్ సినిమా అన్నట్లుగా సమాచారం.

హింసతోపాటు మద్యపానం మోతాదు కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. సెన్సార్ సభ్యులు కండిషన్ విధించినట్లుగా సమాచారం. ఇందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ 20 సెకండ్ హాఫ్ లో 16 మొత్తంగా 36 కట్స్ ని బోర్డు విధించినట్లుగా టాక్ వినిపిస్తోంది. తెలంగాణకు చెందిన సింగరేణి సమీపాన ఉండే వీరపల్లి గ్రామం నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం సెన్సార్ సూచించిన ఈ కట్స్ జాబితా చూసి చిత్ర యూనిట్ షాక్ అయిందట.. ఇక అలా సెన్సార్ కట్టింగ్ పోగా 2 గంటల 39 నిమిషాలకు ఈ సినిమా లాక్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో నాని నట విశ్వరూపం చూపించారనే టాక్ వినిపిస్తోంది.