ఫ్యామిలీ ఒత్తిడితో న‌య‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. పెద్ద త‌ప్పు చేస్తుందా?

సూపర్ స్టార్ నయనతార కెరీర్ పరంగా ఏ రేంజ్ లో దూసుకుపోతుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. గ‌త ఏడాది ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్‌ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసింది. వివాహమైన నాలుగు నెలలకే స‌రోగ‌సి ద్వారా ఇద్ద‌రు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే తల్లి అయిన తర్వాత కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది.

త్వరలో నయన్ బాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టకపోతోంది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ హీరోగా తెర‌కెక్కుతున్న `జ‌వాన్‌` సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే మ‌రిన్ని ఆఫ‌ర్లు కూడా న‌య‌న్ కు క్యూ క‌డుతున్నాయి. అయితే విఘ్నేష్ కెరీర్ మాత్రం అంత సానుకూలంగా సాగ‌డం లేదు. భ‌ర్త‌ ఖాళీగా ఉండి భార్య బడా హీరోయిన్ గా మారిపోతూ ఉండడంతో.. విగ్నేష్ కుటుంబ సభ్యులు ఎంత‌గానో ఆందోళ‌న చెందుతున్నార‌ట‌.

 

ఈ నేప‌థ్యంలోనే భ‌ర్త కెరీర్ పై కాస్త ఫోక‌స్ పెట్ట‌మ‌ని న‌య‌న్ పై ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఒత్తిడితో చేస్తున్నారు. దీంతో న‌య‌న్ కొన్నాళ్లు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కొన్నాళ్లు తాను సినిమాలు చేయ‌డం ఆపి.. భ‌ర్త‌ను స్టార్ డైరెక్ట‌ర్ గా మార్చాల‌ని భావిస్తుంద‌ట‌. ఇందుకోసం సైలెంట్ గా అన్ని ప్లాన్స్ చేస్తుంద‌ని టాక్ న‌డుస్తోంది. అయితే న‌య‌న్ నిర్ణ‌యం ప‌ట్ల ఫ్యాన్స్ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడు న‌ట‌న‌కు బ్రేక్ ఇచ్చి న‌య‌న్‌ పెద్ద త‌ప్పు చేస్తుంద‌ని.. ఎంత స్టార్డ‌మ్ ఉన్నాస‌రే ఒక్క‌సారి గ్రాఫ్ డౌన్ అయిందంటే ఆ త‌ర్వాత మ‌ళ్లీ నిల‌దొక్కుకోవ‌డం చాలా క‌ష్ట‌మ‌వుతుంద‌ని అంటున్నారు.