నాగార్జున హీరోయిన్‌కు ఏమైంది.. ఇంత‌లా మారిపోయిందేంటి…!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో కేవలం ఒక్క సినిమా చేసి మళ్లీ ఇటువైపుకు రాని హీరోయిన్స్ కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారిలోనే ఒకరు అయేషా టకియా. అక్కినేని నాగార్జున, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన సూపర్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించింది ఈ బాలీవుడ్ భామ తన మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది.

Ayesha Takia

ఈ సినిమా తర్వాత ఈమెకు టాలీవుడ్ లో వరుస ఆఫర్లు వచ్చినా కూడా ఈమె ఎందుకో తెలుగులో నటించడానికి ఇష్టపడలేదు, బాలీవుడ్ లోనే తన కెరీర్‌ను కొనసాగించింది. బాలీవుడ్ లో ఈమె తన తొలి సినిమాతోనే స్టార్ హీరో అయినా అజయ్ దేవగన్‌తో కలిసి టార్జాన్ ది వండర్ కార్ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా అక్కడ ఘోరమైన డిజాస్టర్ గా మిగిలిపోయింది.

Ayesha Takia Photos

అయినా కూడా తన నటనకు గాను తన తొలి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డును దక్కించుకుంది అయేషా టకియా. ఇక ఈ సినిమా తర్వాత ఆమె బాలీవుడ్‌లో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత డోర్ అనే సినిమా మాత్రం అయేషా టకియాని హీరోయిన్ గా మరో లెవల్ కు తీసుకువెళ్ళింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించినందుకు ఆమె క్యారెక్టర్ కి ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా వచ్చాయి.

Ayesha Takia Latest Photos

అలా తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే సమాజ్ వాది పార్టీ లీడర్ ‘అబూ అజ్మి’ కుమారుడు ‘ఫర్హాన్ అజ్మీ’ తో ప్రేమలో పడి 2009లో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత రెండు సంవత్సరాలు సినిమాల్లో నటించి ఆ తర్వాత సినిమాల నుంచి తప్పుకుంది. చిత్ర పరిశ్రమకు దూరమైనప్పటికీ అయేషా టకియా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు ఎప్పుడు టచ్ లో ఉంటోంది.

Ayesha Takia Friends Photos

తన వ్యక్తిగత విషయాలను తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉండేది. ప్రస్తుతం ఆమె తన ఫ్యామిలీతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆ ఫోటోలలో అయేషా టకియా ను చూస్తుంటే ఎంతో మారిపోయింది అసలు ఆమెని గుర్తుపట్టలేని విధంగా తన ఫేసులో మార్పులు క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయేషా టకియా తన ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఎంతో హ్యాపీగా ఉంటుంది.