ఆమె కెరియర్ మొత్తం రవితేజ మీద ఆధారపడిందా..!!

ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాతో బ్యాక్ టు బ్యాక్ మంచి విజయాలను అందుకున్నారు రవితేజ. ప్రస్తుతం రవితేజ రావణాసుర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే .టైటిల్ విభిన్నంగా ఉండడంతో పాటు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రవితేజ లుక్ ఈ సినిమా పైన భారీగానే అంచనాలు పెంచేసాయి. రావణాసుర సినిమాలో రవితేజకు జోడిగా జాతి రత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా నటిస్తున్నది. ఈ చిత్రం పైన ఈ ముద్దుగుమ్మ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

RT 68: Faria Abdullah approached to play the leading lady in Ravi Teja's  film? | The Times of India

జాతి రత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అంతటిస్థాయిలో సక్సెస్ కాలేక పోయింది.. లైక్ షేర్ సబ్స్క్రిప్షన్ అనే చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫరియా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత మళ్లీ రవితేజ నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. మొన్నటి వరకు వాల్తేర్ వీరయ్యతో హడావిడిలో ఉన్న రవితేజ ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో రావణాసుర సినిమా షూటింగ్ కి జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. ధమాకా మరియు వాల్తేర్ వీరయ్య సినిమాలతో మంచి సక్సెస్ మీదున్న రవితేజ రావణాసుర సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు.

ఇక ఈ సమ్మర్ లోని ఈ సినిమా విడుదల కాబోతున్నది. రవితేజ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటారని నమ్మకాన్ని అటు అభిమానులు కూడా చాలా ధీమాతో వ్యక్తం చేస్తున్నారు. ఫరియా కెరియర్ గాడిలో పడాలి అంటే కచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అయితే ఈమె కెరియర్ మలుపు తిరుగుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ఫరియా కెరియర్ మొత్తం రవితేజ మీదే ఆధారపడిందని చెప్పవచ్చు.