ఈసారి భోళా శంకర్ సినిమా కూడా డౌటేనా..?

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయంలో కాస్త దూకుడుగా ఉన్నారని చెప్పవచ్చు. ఈసారి సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో తన సినిమాని విడుదల చేయడం జరుగుతోంది. ఇక ఆ వెంటనే తన తదుపరిచిత్రం డైరెక్టర్ మెహర్ రమేష్ తో భోళా శంకర్ సినిమాని చేస్తున్నారు. అయితే ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ టాక్ అందుకున్న వేదాళం సినిమాని రీమిక్కుగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాని ఆల్రెడీ తెలుగులో డబ్ చేశారట. కానీ ఈ సినిమాని తెలుగులో తీస్తున్నారు అనే విషయం తెలియగానే ఆ డబ్బింగ్ వర్షన్ని తీసేశారట.

Bhola Shankar (aka Bholaa Shankar) (2023) | Bhola Shankar Telugu Movie | Bhola  Shankar Cast & Crew, Story, Release Date, Review, Photos, Videos – Filmibeat

తెలుగు ఇండస్ట్రీకి కొద్దిరోజులుగా దూరంగా ఉన్న మెహర్ రమేష్ ఈ రీమిక్స్ సినిమాతో మళ్లీ మెగా అభిమానులను సంతృప్తి పరిచేందుకు రీ ఎంట్రీ ఇచ్చారు. భోళా శంకర్ సినిమా సిస్టర్ సెంటిమెంట్తో ఉండబోతోంది. ఈ సినిమా మీద డైరెక్టర్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమా అనుకున్న విధంగానే అద్భుతంగా వచ్చిందని తెలియజేస్తున్నారు. దాదాపుగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అని సమాచారం. అయితే ఈ సినిమాను సమ్మర్ కు విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Chiranjeevi-Meher Ramesh film titled Bhola Shankar- Cinema express
కానీ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమా వస్తోంది కాబట్టి మరో నాలుగు నెలలు గ్యాప్ లోని ఈ సినిమా విడుదల ఎందుకని భోళా శంకర్ చిత్రాన్ని దసరాకి విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అయితే చిరంజీవి ఈ సినిమా అయిపోయిన వెంటనే ఏ సినిమా చేస్తారు అనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు. అందుచేతనే భోళా శంకర్ సినిమా చివరి నిమిషం వరకు మెగా అభిమానులను అలదించేలా తీర్చిదిద్దాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇందులో చిరంజీవి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటించిన హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది.