ఆరోజు సమంత అభిమానుల ముందుకు రాబోతోందా..?

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. సమంత నటించిన యశోద చిత్రం గత ఎడాది విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు సమంత చేతిలో కేవలం శాకుంతలం, ఖుషి వంటి చిత్రాలు ఉన్నాయి. ఇక వచ్చే నెల 17వ తేదీన శాకుంతలం సినిమా భారీ ఎత్తున విడుదల కాబోతున్నట్లు గడిచిన కొద్దిరోజుల క్రితం అధికారికంగా చిత్ర బృందం ప్రకటించారు. ఈ సినిమాని డైరెక్టర్ గుణశేఖర్ తన దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇక ఈ సినిమా విడుదల సమయం చాలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ను కూడా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు డైరెక్టర్ గుణశేఖర్.

Samantha as Shakuntala | Shaakuntalam | Gunasekhar | Manisharma | Neelima  Guna | Gunaa Teamworks - YouTube

సాధారణంగా అయితే సినిమా విడుదలకు వారం లేదా రెండు వారాల ముందు మాత్రమే ట్రైలర్ ని విడుదల చేస్తారు.శాకుంతలం సినిమా పైన అంచనాలు ఉండడంతో చిత్ర బృందం నెల రోజులకు పైగా ముందుగానే ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తోంది.ఈ సినిమా యొక్క ట్రైలర్ 9వ తారీఖున పివిఆర్ ఆర్కే సినీ ఫ్లెక్సీలో ఆవిష్కరించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈవెంట్ లో సమంత పాల్గొంటుందా లేదా అనే విషయంపై ప్రతి ఒక్కరు ఆసక్తికరంగా ఉన్నారు.

సమంత పలు అనారోగ్య సమస్య కారణంగా గత కొన్ని రోజులుగా కేవలం తన ఇంట్లోనే చికిత్స చేయించుకుంటూ ఉంటోంది. నిన్నటి రోజున ముంబై ఎయిర్ పోర్టులో సందడి చేయడం జరిగింది అంటూ ఒక వీడియో కూడా వైరల్ గా మారింది. దీంతో అభిమానులు కాస్త ఖుషి పడ్డారని తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో సినిమా షూటింగ్లకు ఈవెంట్లకు సమంత హాజరవుతుందో లేదో చూడాలి మరి.