ఎట్టకేలకు తన పెళ్లి పై స్పందించిన యాంకర్ శ్రీముఖి..!!

తెలుగు బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది యాంకర్ శ్రీముఖి. ముఖ్యంగా టీవీ ఆడియన్స్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మొదట పటాస్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.ఆ తర్వాత వెండితెర పైన పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లలో నటించింది. ఇక సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది శ్రీముఖి. ఈ సందర్భంగా తన పెళ్లి ఎప్పుడు అంటూ కొద్ది రోజులుగా వస్తున్న వార్తలపై స్పందించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Actress Srimukhi Latest Photoshoot HD Pics | New Movie Posters

గతంలో కూడా శ్రీముఖి వివాహం పై వార్తలు రావడంతో ఆమె క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాజాగా ఇప్పుడొచ్చిన రూమర్ల పైన ఘాటుగా స్పందిస్తూ మరొకసారి ఖండించింది.ఒకసారి బాయ్ ఫ్రెండ్ ఎవరు అంటూ మరొకసారి పెళ్లి ఎప్పుడంటు ఇక తాజాగా మా నాన్న ఫోటో అని బ్లర్ చేసి పెళ్లి రూమర్లను పుట్టించడం చాలా దారుణం అంటూ ఫైర్ అవుతోంది శ్రీముఖి. ఈ వార్తలను విని విని విసుగు వస్తోంది .ఇక పెళ్లి విషయానికి వస్తే మూడు నాలుగు ఏళ్ల తర్వాతే వివాహం చేసుకుంటానంటు గట్టిగా కౌంటర్ ఇచ్చింది శ్రీముఖి.

యాంకర్ శ్రీముఖిపై కేసు నమోదు | case filed against anchor srimukhi
ఇప్పుడప్పుడే పెళ్లి ఆలోచన లేదని ఇప్పటికే స్పష్టం చేశానని తెలియజేస్తోంది. మరొకసారి క్లారిటీ ఇస్తూ తనపై వచ్చిన రూమర్లకు చెక్ పెట్టింది. పలు టీవీ షోలతో సినిమాలతో బిజీగా ఉన్న శ్రీముఖి ప్రస్తుతం తన కెరీర్ పైన ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఆడప దడప సినిమాలలో హీరోయిన్గా నటిస్తూనే పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లలో నటిస్తోంది.