అదిరిపోయిన `వాల్తేరు వీర‌య్య‌` ట్రైల‌ర్.. ఇక ఫ్యాన్స్ కి పున‌కాలే!

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మ‌హారాజా ర‌వితేజ క‌లిసి న‌టించిన ఊర మాస్ ఎంట‌ర్టైన‌ర్ `వాల్తేరు వీయ్య‌`. బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. ఇందులో శృతి హాస‌న్‌, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా న‌టించారు. సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలను పోషిస్తున్నారు.

ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సంక్రాంతి పండుగ కానుక‌గా జ‌న‌వ‌రి 13న ఈ చిత్రం అట్ట‌హంగా విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు క్రియేట్ అవ్వ‌గా.. మ‌రింత హైప్‌ను పెంచ‌డం కోసం మేక‌ర్స్ తాజాగా `వాల్తేరు వీర‌య్య‌` ట్రైల‌ర్ ను బ‌య‌ట‌కు వ‌దిలారు. ఈ ట్రైల‌ర్ అదుర్స్ అన‌డంలో సందేహ‌మే లేదు. `మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరెట్టిందే ఆయన్ను చూసి.`. అంటూ చిరు క్యారెక్ట‌ర్ ను ప‌రిచ‌యం విధానం అద్భ‌తంగా ఉంది.

ట్రైల‌ర్ లో చిరు ఇంటర్నేషనల్ డ్రగ్స్ డీలర్ గా చూపించారు. ఆయన్ను పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ అధికారిగా రవితేజ కనిపించాడు. `రికార్డుల్లో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీద రికార్డులు ఉంటాయి`, `మీ క‌థ‌లోకి నేను రాలా.. నా కథలోకే మీరందరూ వచ్చారు. వీడు నా ఎరా.. నువ్వే నా సొర‌` చిరు ప‌లికిన మాస్ డైలాగ్స్ విజిల్స్ వేయిస్తున్నాయి. `వైజాగ్ లో గ‌ట్టి వేట‌గాడు లేడ‌ని ఓ పులి పూన‌కాల‌తో ఊగుతుంద‌ట‌` అంటూ ర‌వితేజ ఎంట్రీ ఆక‌ట్టుకుంది. ఫైట్స్‌, బీజీమ్, విజుల్స్ కేక పెట్టించాయి.

ఇక చివ‌ర్లో `హలో మాష్టారు! ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఒక్కొక్కడికి బాక్సులు బద్దలైపోతాయి` అని రవితేజ వార్నింగ్ ఇవ్వడం… `ఏంట్రా బద్దలయ్యేది? ఈ సిటీకి నీలాంటి కమీషనర్లు ఎంతో మంది వస్తారు, పోతారు. కానీ, వీరయ్య లోకల్` అని చిరంజీవి కౌంటర్ ఇవ్వడం హైలైట్ గా నిలిచింది. మొత్తానికి ట్రైల‌ర్ అదిరిపోయింది. ఈ సంక్రాంతికి ఫ్యాన్స్‌కి `వాల్తేరు వీర‌య్య‌` పూన‌కాలు తెప్పిండ‌చం ఖాయంగా క‌నిపిస్తోంది.