ఒక్క సినిమాతో రెమ్యూనరేషన్ డబుల్ చేసిన నిఖిల్..!!

యంగ్ హీరో నిఖిల్ తాజాగా కార్తికేయ-2 చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై భారీగానే కలెక్షన్లు సాధించింది. నిఖిల్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. కార్తికేయ సినిమా తర్వాత నిఖిల్ తన తదుపరి చిత్రాలను చాలా స్పీడుగా తెరకెక్కిస్తున్నారు. అలా తెరకెక్కిస్తున్న వాటిలో 18 పేజీస్స్, స్పై వంటి చిత్రాలు ఉన్నాయి. 18 పేజీస్ సినిమా భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేయడంతో ముందు ముందు నిఖిల్ అన్ని సినిమాలకు కూడా ఖచ్చితంగా కలెక్షన్లు భారీగానే వసూలు చేస్తాయని అభిమానులు భావిస్తున్నారు.

Actor Nikhil responds to divorce rumours - TeluguBulletin.comఈ నేపథ్యంలోనే నిఖిల్ తన రెమ్యూనరేషన్ కూడా పెంచేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం . కార్తికేయ-2 సినిమా మందు వరకు రూ.5 కోట్ల రూపాయలు అందుకున్నా నిఖిల్ కానీ ఇప్పుడు దాదాపుగా రెండింతలు రెట్టింపు అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే దాదాపుగా రూ.9 నుంచి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల అందుతున్న సమాచారం ప్రకారం ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ రూ.9 కోట్ల రూపాయలు ఇచ్చి మరి నిఖిల్ సినిమాను చేసేందుకు ఒప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అందులో భాగంగానే భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చినట్లుగా కూడా సమాచారం.నిఖిల్ ప్రస్తుతం యంగ్ హీరోలలో మంచి క్రేజ్ ఉన్న హీరోగా పేరుపొందారు. మంచి కథతో సినిమా తీయాలే కానీ పాన్ ఇండియా రేంజ్ లో వసూళ్లను కూడా రాబడుతోందని చెప్పవచ్చు. అందుకే రెమ్యూనరేషన్ పెంచడం తప్పడం లేదు అన్నట్లుగా కొంతమంది నిర్మాతల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.