ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఓ అరుదైన అవార్డును అందుకున్నారు. ప్రముఖ మేగజీన్ `జీక్యూ` అవార్డు 2022కి సంబంధించిన `జీక్యూ మ్యాన్ ఆఫ్ ది ఇయర్` అవార్డును బన్నీ సొంతం చేసుకున్నాడు. ఆయన్ని `లీడింగ్ మ్యాన్` పిలవడం మరో విశేషం. ఫలక్‌నూమా ప్యాలెస్ లో ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు బన్నీ.
ఈ అవార్డును బన్నీకి అందించడం కోసం జీక్యూ సంస్థ నిర్వహకులు స్వయంగా హైదరాబాద్‌కి విచ్చేశారు. ఈ అరుదైన అవార్డును అల్లు అర్జున్ అందుకున్నట్టు సోషల్ మీడియాలో పేర్కొంటూ కొన్ని ఫొటోలను అందరితోనూ పంచుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి వ్యక్తి బన్నీనే కావడంతో.. ఆయన ఫ్యాన్స్ ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.
అది మా బన్నీ అంటే.. అని కాలర్ ఎగరేస్తున్నారు. కాగా, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప 2` సినిమా చేస్తున్నాడు. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలె పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం వచ్చే ఏడాది ఆఖరిలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.