టాలీవుడ్ యంగ్ హీరో మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం విరూపాక్ష.ఈ చిత్రాన్ని కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ సుకుమార్ నిర్మిస్తూ ఉన్నారు. రీసెంట్గా ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ ఒక గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది. అందుకు సంబంధించి ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది. ఇందులో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తన పవర్ ఫుల్ వాయిస్తూ ఈ సినిమాకి వాయిస్ ఓవర్ అందించడం విశేషం అని చెప్పవచ్చు.
ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ నెట్టింట వైరల్ కావడంతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ్ ,మలయాళం ,కన్నడ, హిందీ వంటి భాషలలో ఏకకాలంలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా తమిళ వెర్షన్ కు సంబంధించి టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. నిన్నటి రోజున ఈ చిత్రం టైటిల్ ని విడుదల చేయడం జరిగింది. ఇందులో గంభీరమైన వాయిస్ తో ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా కనిపిస్తోంది.
ఇదంతా ఇలా ఉండగా అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్ర బాటలోనే ఈ సినిమా కూడా బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప సినిమాని ఉత్తరాది ప్రేక్షకులకు చేరువ చేసిన గోల్డ్ మైన్స్ సంస్థ సాయి ధరంతేజ్ నటిస్తున్న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.ఇప్పటికే మేకర్స్ ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 23వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో కీలకమైన పాత్రలు బ్రహ్మాజీ అజయ్ సునీల్ నటిస్తూ ఉన్నారు. సాయి ధరంతేజ్ కం బ్యాక్ ఏమాత్రం కలిసొస్తుందో చూడాలి మరి.