శివ కార్తికేయన్.. తమిళ హీరో అయిన ఈయన `రేమో` సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయి సూపర్ హిట్ అందుకున్నాయి. ఇటీవల శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన డాక్టర్, డాన్ వంటి కమర్షియల్ గా సక్సెస్ ను సాధించి హీరోగా తిరుగులేని స్టార్ స్టేటస్ ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం జాతి రత్నాలు సినిమా డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తీకేయన్ హీరోగా నటించిన సినిమా `ప్రిన్స్`. తాజాగా దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ సినిమా రిలీజ్ అయి మంచి సూపర్ హిట్ సక్సెస్ను అందుకుంది.
అయితే శివ కార్తికేయన్ అటు కోలీవుడ్ ఎటు టాలీవుడ్ ఇండస్ట్రీలో తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కానీ జీవితంలో మాత్రం ఎన్నో చేదు సంఘటనలు మరియు అవమానాలను ఎదుర్కొన్నారట. శివ కార్తికేయన్ కెరీర్ ప్రారంభంలో మిమిక్రీ ఆర్టిస్ట్ గా.. ఆ తరువాత యాంకర్ గా మరియు హాస్యనటుడిగా కూడా కొన్ని చిత్రాలలో నటించి ఆ తర్వాత హీరో అయ్యాడట. అంతేకాకుండా ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని ప్రస్తుతం వరస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు.
ఈ నేపథ్యంలోనే ఆయన నటించిన `ప్రిన్స్` సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ లో పాల్గున్నాడు. ఆ క్రమంలోనే తనపై వచ్చిన ట్రోలింగ్స్ గురించి స్పందిస్తూ తననే కాకుండా తన ఫ్యామిలీపై కూడా ట్రోల్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు యాంకర్ మాట్లాడుతూ.. మీకు ఓ నిజం చెప్పమంటారా.. మీరంటే నచ్చని వాళ్ళు ఎవరూ లేరు, ఎవ్వరూ మిమ్మల్ని అసహ్యించుకోరు అని అనగా.. శివ కార్తికేయన్ ఇలా సమాధానమిచ్చాడు.. తానంటే నచ్చని వాళ్ళు చాలామంది ఉన్నారని.. తన ట్విట్టర్ టైం లైన్ లోకి వెళ్లి చూస్తే తాను మాత్రమే కాకుండా తన ఫ్యామిలీని కూడా ట్రోలింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
మరికొందరు నన్ను అభిమానించిన ప్రజలు నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టే నేను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానని కూడా ఆయన చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా మనం ఇలా చేస్తే బాగుంటుందని చెప్పడానికి… మనం ఏం చేసినా బాగోలేదని చెప్పడానికి.. చాలా తేడా ఉందని మనం పట్టించుకోవడం అన్న విషయంపై అంతా ఆధారపడి ఉంటుందని ప్రస్తుతం నన్ను ట్రోల్ చేసినా నేను పట్టించుకోవడం లేదు అంటూ ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Say No to Actor and Personal Abuses!
Everyone is watching every thing that's happening here. It's hard to see them like this🫤
Avoid Panniklam🤍https://t.co/xphppZssBe
— Manoj Maddy (@edits_manoj) October 21, 2022