బాలయ్య నోట అతి పెద్ద బూతు మాట..అయ్యయ్యో నోరు జారాడుగా.!!

అయ్యయ్యో ..బాలయ్య నోట ఇంత పెద్ద బూతు మాట . అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే. పాపం  అడ్డంగా బుక్ అయిపోయాడు. ఎస్ ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. మనకు తెలిసిందే బాలయ్యకు కొంచెం కోపం ఎక్కువ .దూకుడు ఎక్కువే.. ప్రేమ అంతకన్నా ఎక్కువ. కోపం వస్తే అరిచే బాలయ్య ప్రేమ వస్తే దగ్గరికి తీస్తాడు. కష్టమని వస్తే సహాయం చేస్తాడు.

అఫ్ కోర్స్ అవన్నీ బాలయ్య గురించి అందరికీ తెలిసిందే. కానీ రీసెంట్గా బాలయ్య అన్ స్టాపబుల్ షోలో పొరపాటున ఒక బూతు మాట మాట్లాడి నెట్టింట ట్రోలింగ్ కి గురవుతున్నాడు. అసలే బాలయ్య ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని కాచుకొని కూర్చున్న ట్రోలర్స్ కు మంచి అవకాశం ఇచ్చింది అన్ స్టాపబుల్ 2. రీసెంట్ గానే ప్రారంభమైన ఈ షోలో హోస్టుగా బాలయ్య అదరగొట్టేస్తున్నాడు . మొదటి ఎపిసోడ్ గెస్ట్లుగా వచ్చిన నారా చంద్రబాబునాయుడుని, లోకేష్ ను ఆట ఆడుకున్నాడు . అంతేకాదు ఏకంగా షోలో తన చెల్లెమ్మకు చంద్రబాబు నాయుడు దగ్గర ఐ లవ్ యు కూడా చెప్పించాడు.

దీంతో సరదా సరదాగా సాగిపోయిన ఫస్ట్ ఎపిసోడ్ అందర్నీ ఆకట్టుకుంది . అందరి కళ్ళు రెండో ఎపిసోడ్ పైనే పడ్డాయి . ఈ క్రమంలోనే షో కి గెస్ట్లుగా వచ్చిన విశ్వక్ సేన్ సిద్దు జొన్నలగడ్డతో సరదాగా ముచ్చటించాడు బాలయ్య. ఈ క్రమంలోనే సరదాగా నువ్వు నన్ను డైరెక్ట్ చేయమని బాలకృష్ణ విశ్వక్ సేన్ తో అంటాడు. అప్పటికప్పుడు విశ్వక సేన్..”నేను మీకు ఫ్యాన్స్ కావాలా.. హీరోయిన్ కావాలా అని అడుగుతాను దానికి మీరు మింగితే షేప్ అవుట్ అవుతావు అని అనమని అంటాడు ..అలాగే నందమూరి బాలకృష్ణ రిపీట్ చేయడానికి ప్రయత్నించుగా పొరపాటున బై మిస్టేక్ గా ఆయన నోటి నుంచి మింగితే బదులుగా ఇంకొక పచ్చి బూతు పదం వచ్చింది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉండే జనాలు షాక్ అయిపోయారు . అంతేకాదు ఈ ఒక్క వీడియో క్లిప్ ని పట్టుకొని నందమూరి బాలకృష్ణ ను నెట్టింట ట్రోలింగ్ కి గురి చేస్తున్నారు. ఏది ఏమైనా సరే బూతు మాటలు పొరపాటున నోరు జారడం సహజమే .. బాలయ్య లాంటి హీరో అయ్యేసరికి ట్రోలర్స్ ఆడేసుకుంటున్నారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.