అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగునాట అతనికున్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అల్లరి అనే సినిమాలో నటించాక నరేష్ వెనక్కి తిరిగి చూసుకోవలసిన pపని లేకుండా పోయింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో నరేష్ పేరు కాస్త ‘అల్లరి నరేష్’గా మారిపోయింది. ముఖ్యంగా సినిమాల్లో ఆయన చేసే కామెడీకి జనాలు పడి చస్తారు. ఏడాదికి కనీసం ఓ నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంటున్న అల్లరి నరేష్ ఈ మధ్య కాలంలో మాత్రం అమావాస్య కో పౌర్ణమికో సినిమా చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
రీల్ లైఫ్ లో కామెడీ హీరో అయినటువంటి నరేష్ రియల్ లైఫ్ లో మాత్రం చాలా సీరియస్ గా ఉంటారట. ఒక సారి తన జీవితంలో ఎవరినైనా ఇష్టపడితే వారిని అస్సలు మర్చిపోడట. బేసిగ్గా అల్లరి నరేష్ చాలా సీరియస్ గా సిన్సియర్ గా ఉంటారు. కానీ సినీ ఇండస్ట్రీలో అలా ఉంటే కుదరదు.. ఎదుటివారు ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అయితే ఈ విషయం తెలుసుకోని నరేష్ తెలియకుండానే ఓ అమ్మాయి (హీరోయిన్) ప్రేమలో పడి మోసపోయిన హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆ హీరోయిన్ కూడా నరేష్ ని పీకల్లోతు ప్రేమించిందట. ఎందుకంటే అప్పట్లో అల్లరి నరేష్ మంచి మంచి సినిమాలు చేస్తూ మంచి రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు.
దాంతో ఆ హీరోయిన్ నరేష్ మీద ప్రేమ ఉన్నట్టు నటించింది. ఈమె నటి కాబట్టి రియల్ లైఫ్ లో కూడా ఎలా నటించాలో ఆమెకు తెలుసు. అందుకే కొన్నాళ్లు నరేష్ తో ఎంజాయ్ చేసి పెళ్లి చేసుకుందాం అనేసరికి నరేష్ కి బ్రేకప్ చెప్పి అసలు నీ లాంటి కామెడీ హీరోని నేను పెళ్లి చేసుకోవాలా అని నవ్వుకొని వెళ్లిపోయిందట. అంతేకాదు నరేష్ కి బ్రేకప్ చెప్పాక నరేష్ ఫ్రెండ్ అయిన మరో కోలీవుడ్ స్టార్ హీరో ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు తల్లయ్యింది. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఇక ఆమె ఎవరన్న విషయం గురించి చెప్పాల్సిన పనిలేదేమో.
అల్లరి నరేష్ ని ఆ హీరోయిన్ మోసం చేసిందా? తరువాత నరేష్ ఫ్రెండ్ తోనే అలా?
