టాలీవుడ్ మాస్ హీరో రవితేజ హీరో గా నటించిన చిత్రం.. “రామారావు ఆన్ డ్యూటీ”. శరత్ మండవ ఓ సరికొత్త స్టైల్ లో దర్శకత్వం వహించిన ఈ మూవీ కొద్దిసేపటి క్రితమే ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. గత కొంత కాలంగా హిట్ అన్న పదానికి దూరమైన రవితేజ కి ఈ సినిమా చాలా కీలకం. ఫ్యాన్స్ కూడా మా అన్న ఎలాగైన హిట్ కొట్టాలి అని బలంగా కోరుకున్నారు. ఆ దేవుడి కరుణించాడు. ఎట్టకేలకు రవితేజ తన ఖాతాలో మరోసారి హిట్ సినిమా వేసుకున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, ట్రైలర్ ఆకట్టుకోవడం తో సినిమా పై భారీ స్దాయిలో అంచనాలు పెట్టుకుని ఉన్న అభిమానుల ఎక్స్ పెక్టేషన్స్ ని శరత్ మండవ అందుకున్నారా లేదా ఇప్పుడు చూద్దాం.
ఫుల్ మాస్ యాక్షన్ సీన్స్ తో రవితేజ దుమ్ముదులిపేశాడు అంటున్నారు సినిమా చూసిన జనాలు చెప్పుతున్నారు. స్టోరీ పాతదే అయినా..శరత్ మండవ రవితేజ బాడీ లాంగ్వేజ్ పట్టేసి..అభిమానులు ఆయనను ఎలా చూపిస్తే సాటిస్ఫై అవుతారో సేమ్ అలానే చూపించి..ఫ్యాన్స్ ఆకలి తీర్చేశాడు. రవితేజ అంటే మాస్‌కి కేరాఫ్ అడ్రెస్ .. ఆయనకు మాస్ లుక్స్ లో చూసేందుకే జనాలు లైక్ చేస్తారు. అందుకే మాస్ మహా మహారాజా అనే బిరుదుని కూడా పెట్టారు అభిమానులు.
ఇక అందుకు తగ్గట్టే ఈ సినిమాలో రవితేజ మాస్ డైలాగ్స్, ఎనర్జిటిక్ పర్ ఫామెన్స్, జనాలను అట్రాక్ట్ చేసాయి. ఈ సినిమాకి రజిషా విజయన్ , దివ్యాంశ కౌశిక్ అందాలు కూడా ప్లస్ అయ్యాయి అనే చెప్పాలి. ఈ సినిమాకి మెయిన్ హైలెట్ పాయింట్ హీరో వేణు తొట్టెంపూడి . ఆయన నటన గురించి కొత్తగా చెప్పక్కర్లేదు..సినిమాలో ఆయన కీ రోల్ ప్లే చేశాడు. డిప్యూటీ కలెక్టర్ క్యారెక్టర్లో మాస్ మహారాజ హై ఓల్టేజ్ పర్ ఫామెన్స్ ధియేటర్స్ జనల చేత విజిల్స్ వేయిస్తుంది.
ఫస్ట్ హాఫ్ స్లో గా సాగిన..ఇంటర్వెల్ బ్యాంగ్ అద్దిరిపోతాది..సెకండ్ హాఫ్ లో అసలైన రవితేజ కనిపిస్తాడు..ఆయన నోటి నుండీ వచ్చే ఒక్కో మాస్ డైలాగ్స్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయి..అంటున్నారు ఫ్యాన్స్. చట్టానికి లోబడి, న్యాయం కోసం బాధ్యత నిర్వహించే పాత్రలో రవితేజ ఇరగదీశాడు . ఓ వైపు డీసెంట్ గా ఉంటూనే తన జోలికి వచ్చిన వాళ్లకి పగిలిపోయే ఆన్సర్స్ ఇస్తూ రవితేజ చేప్పిన్ పంచ్ డైలాగులు సినిమా కే హైలెట్ అయ్యింది.
ఫస్ట్ హాఫ్‌లో రవితేజ్ లుక్, మాస్ ఎలిమెంట్స్ అదిరిపోయాయని పాటలు పెద్దగా జనాలని ఆకట్టుకోక పోయినా.. రవితేజ సీన్స్ అప్పుడు వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్‌గా ఉందంటున్నారు. నిజానికి శరత్ మండవకు ఇది ఫస్ట్ సినిమా..కానీ, రవితేజ ని చాలా చక్కగా చూయించాడు. సినిమా మొత్తానికి రవితేజ యాక్టింగ్ హైలెట్ గా నిలిచింది. అభిమానుల రివ్యూ చూస్తుంటే రవితేజ డ్యూటీ ఎక్కేశాడు అనే చెప్పాలి. టాక్ పరంగా హిట్ అనిపించుకున్న ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి..!!
#RamaRaoOnDuty Review
FIRST HALF:
A Decent One 👍#RaviTeja is in his elements & looks perfect ✌️
Songs are average but BGM is Terrific 👏
Production Values Looks Good 👍
Second Half is the key 🙏#RamaRaoOnDutyReview #DivyanshaKaushik pic.twitter.com/5sS4tmBDFz
— Kumar Swayam (@KumarSwayam3) July 28, 2022
Just finished watching movie.
Completely mass and political leaders movie with good exlent bgm.
My rating 3.5/5#RamaRaoOnDuty #RaviTeja #RamaRaoOnDutyFromJuly29th pic.twitter.com/Z065RfStHu— jagadhish (@Nenavat_Jagan) July 28, 2022