తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఎనిమిది వారాలను పూర్తి చేసుకున్న ఇంటి సభ్యులు తొమ్మిదో వారంలోకి అడుగు పెట్టారు. మొత్తం 19 మందితో ప్రారంభమైన ఈ షోలో ఇంకా 11 మందే మిగిలారు. సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేతా వర్మ, ప్రియలు వరసగా ఎలిమినేట్ కాగా.. ఎనిమిదో వారం అందరూ ఊహించినట్టే లోబో బ్యాగ్ సద్దుకుని బయటకు వచ్చేశారు.
మొదట్లో తెగ నవ్వించిన లోబో.. రానురానూ డల్ అయిపోయాడు. టాస్కుల్లో సైతం పేలవ ప్రదర్శన చేశాడు. ఇక ఆరో వారం ఫేక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు వచ్చేసి మళ్లీ హౌస్లోకి వెళ్లిన లోబో..పెద్దగా సత్తా చాటలేకపోయారు. మొత్తానికి ఎంటర్టైనర్ ఆఫ్ హౌస్గా పేరు తెచ్చుకున్న లోబో.. ఉన్న ఎనిమిది వారాలకు గానూ బాగానే సంపాదించాడు.
వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. లోబో వారానికి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు తీసుకున్నాడట. ఈ లెక్కన అతడు రోజుకు దాదాపుగా పాతిక వేల పైచిలుకు వెనకేసినట్లు తెలుస్తుండగా.. ఎనిమిది వారాలకు ఏకంగా 15 లక్షల కన్నా ఎక్కువే సంపాదించాడని టాక్.