ఈ సంవత్సరం క్రాక్ సినిమాతో గ్రాండ్ సక్సెస్ను అందుకున్న రవితేజ మరోసారి కిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రవితేజ ను మనం చాలా డిఫరెంట్ యాంగిల్ లో చూడవచ్చు.రవితేజ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో సాలిడ్ యాక్షన్ తో ఈ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. మరి ఇప్పుడు షూట్ ఫైనల్ టచ్ లో ఉన్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఈరోజు ఓ బిగ్ అప్డేట్ ని రివీల్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.
ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ వచ్చి మంచి రెస్పాన్స్ అందుకోగా..ఇప్పుడు మేకర్స్ రెండవ పాటని రిలీజ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేశారు. వచ్చే నవంబర్ 4న దీపావళి కానుకగా ఈ ఇంట్రెస్టింగ్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.ఇక ఈ చిత్రంలో మాస్ మహారాజ్ డ్యూయల్ రోల్స్ చేస్తుండగా డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని పెన్ స్టూడియోస్ మరియు ఏ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు. ఒక మొదటి పాట తోనే మంచి రెస్పాన్స్ ను అందుకోవడంతో రెండవ పాట కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు
Unveiling #Khiladi Second Single on Nov 4th
RockStar @ThisIsDSP Musical@RaviTeja_offl @DimpleHayathi @Meenakshiioffl @DirRameshVarma @akarjunofficial @idhavish #KoneruSatyanarayana #AStudiosLLP @PenMovies @adityamusic pic.twitter.com/tiPginFoRs
— BA Raju's Team (@baraju_SuperHit) October 29, 2021