ఇన్నాళ్లూ బిగ్ స్క్రీన్‌కే పరిమితం అయిన నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు స్మాల్ స్క్రీన్‌పై అడుగు పెట్టి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. బాలయ్య తొలిసారి హోస్ట్‌గా వ్యవహరించబోతున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే`. ప్రముఖ ఓటీటీ సంస్థ `ఆహా`లో దీపావళి సందర్భంగా నవంబర్ 4 నుండీ ఈ టాక్ షో ప్రారంభం కానుంది.
అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ షో మొత్తం 12 ఎపిసోడ్లుగా స్ట్రీమింగ్ కానుంది. ఈ టాక్ షోలో బాలయ్య సినీ సెలబ్రెటీలను తనదైన శైలిలో ఇంటర్వ్యూలో చేయబోతున్నారు. అయితే తాజాగా ఆహా వారు ఈ షో ప్రోమోను విడుదల చేశారు.
ఈ ప్రోమోలో బాలయ్య స్టైల్, హ్యాండ్సమ్ లుక్, డైలాగ్స్.. ఇలా అన్నీ అదిరిపోయాయని చెప్పాలి. బాలయ్య ఈ సారి తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు రుచి చూపించబోతున్నారని ప్రోమో బట్టీ స్పష్టంగా అర్థం అయింది. మొత్తానికి ఆకట్టుకుంటున్న తాజా ప్రోమో.. షోపై మరిన్ని అంచనాలను క్రియేట్ చేసేంది. కాగా, ఈ షో మొదటి ఎపిసోడ్లో మంచు మోహన్ బాబు, మనోజ్, విష్ణు మరియు లక్ష్మిలు గెస్ట్లుగా రానున్నారని సమాచారం.