డ్రగ్స్ గురించి షెర్లిన్ చోప్రా షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్?

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో అరెస్టు అయిన విషయం అందరికి తెలిసిందే. ఈ విషయంలో చాలా మంది ప్రముఖులు షారుక్ ఖాన్ కి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా డ్రగ్స్ విషయం గురించి మాట్లాడుతూ పాత వీడియోని ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో షారుక్ ఖాన్ ఇచ్చిన పార్టీలో తాను చూసిన విషయాల గురించి ఆమె పంచుకుంది.

ఈ స్టార్ కి ఐపీఎల్ కోల్కతా నైట్ రైడర్స్ వున్న సంగతి తెలిసిందే.దానికి సంబంధించిన సారు ఒక పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీలో డాన్స్ చేసి అలసిపోయి వాష్ రూమ్ కి వెళ్లాను. డోర్ ఓపెన్ చేయగానే అక్కడ దృశ్యాలు చూసి ఒక్క సారిగా షాక్ అయ్యాను. అప్పుడు ఒక క్షణం తర్వాత ఒక విషయం అర్థం అయింది.

అక్కడ ఉంది బాలీవుడ్ స్టార్ల భార్యలు. వారందరూ అక్కడ అద్దాల ముందు నిల్చుని తెల్ల పౌడర్ ని పిలుస్తున్నారు. ఇంక వారు డ్రగ్స్ తీసుకుంటున్నారని నాకు అర్థమైపోయింది. వారిని చూసి నవ్వి బయటకు వచ్చేసాను. ఆ తరువాత షారుఖ్ కి అలాగే అతని స్నేహితులకు గుడ్ బై చెప్పి వెళ్లిపోయారు అని చెప్పుకొచ్చింది బ్యూటీ.