అల్లు అర్జున్‌కు చిరు బిగ్ షాక్‌..మామ కోసం బ‌న్నీ త‌గ్గుతాడా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆయ‌న మామ మెగాస్టార్ చిరంజీవి బిగ్ షాక్ ఇవ్వ‌బోతున్నారు. ఇప్పుడిదే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. చిరంజీవి, కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డేలు కీల‌క పాత్ర పోషించారు.

Acharya (2021) - IMDb

భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం మే నెల‌లోనే విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాను డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ నిర్ణ‌యించుకున్నార‌ట‌. అంతేకాదు, ఈ డేట్‌ను ఓ పోస్ట‌ర్ రూపంలో అధికారికంగా కూడా ప్ర‌క‌టించ‌నున్నార‌ట‌.

Allu Arjun's Telugu film 'Pushpa' to release in two parts

అయితే డిసెంబ‌ర్ 17న అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న `పుష్ప‌` మొద‌టి భాగం విడుద‌ల కానుంద‌ని ఇప్ప‌టికే మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా ఆచార్య సైతం అదే రోజున ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతోంది. మ‌రి అదే జ‌రిగితే.. మామ కోసం బ‌న్నీ వెన‌క్కి త‌గ్గి త‌న సినిమాను వాయిదా వేసుకుంటాడా..? లేక ఆచార్య‌తో బాక్సాఫీస్ పోటీకి దిగుతాడా..? అన్న‌ది చూడాలి.