బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అందంతో పాటు అభినయం ఉన్న హీరోయిన్ లలో ఈమె కూడా ఒకరు. దీపికా పదుకొనే రణవీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం తగ్గకుండా అదేరీతిలో కొనసాగిస్తూ కెరీర్లో దూసుకుపోతోంది. రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి సినిమాలలో విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ బ్యూటీ తాజాగా ఒక అరుదైన ఘనతను సాధించింది.
ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే ది గ్లోబల్ అచీవర్స్ అవార్డు 2021 ని దక్కించుకుంది. ఈ అవార్డు కోసం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, చదువు, టూరిజం వంటి వివిధ రంగాల్లో ఈ ఏడాది 3000 కు పైగా నామినేషన్లు వచ్చాయి. ఇందులో నటనకు సంబంధించి ఉత్తమ నటిగా దీపికాపదుకునే అవార్డు ను సాధించింది. ఈ అవార్డుకు అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా, బిజినెస్ మెన్ జెఫ్ బెజోస్, క్రీడాకారుడు క్రిస్టినో రోనాల్డో లాంటి హేమాహేమీలతో కలిసి ఎంపిక అయ్యింది. కాగా ఇండియా నుంచి ఈ అవార్డుకు ఎంపికైన తొలి ఇండియన్ దీపికా కావడం విశేషం. ఈమె ప్రస్తుతం చేతినిండా అవకాశాలతో బిజీ బిజీగా గడుపుతోంది.