ప్రెగ్నెన్సీ కారణంగా ఆ హీరోయిన్ ని సినిమాల నుంచి తొలగించారట?

బాలీవుడ్ కపుల్ నేహా దూపియా, అంగద్ బేడీ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ దంపతులిద్దరూ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తూనే వ్యక్తిగత జీవితాన్ని కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ దంపతులకు మొహర్ అనే కూతురు కూడా ఉంది. నేహా ఒక సారి ప్రెగ్నెన్సీ తో ఉన్న విషయం ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రకటించండి. అంగద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లి తర్వాత వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి పంచుకున్నారు.

నేహా రెండోసారి ప్రెగ్నెంట్ కావడంతో ఆమె అనేక ప్రాజెక్టులను కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఎవరూ కూడా నేహా ని అలాగే కొనసాగించడానికి ఇష్టపడలేదు. నా పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు. అనేక కార్యక్రమాలు నుంచి పంపించారు. ఇండస్ట్రీలో మనం చాలా ఏళ్ళు ఉంటాం,అందువల్ల అన్నీ మరిచిపోయి జీవితంలో ముందుకు సాగిపోవాలి అని చెప్పుకొచ్చారు. అలా నన్ను కొందరు చేసిన తరువాత అంతకంటే మంచి మనుషులు, క్రేజీ ప్రాజెక్టులలో పనిచేసే అవకాశం లభించింది అదే జీవితం అంటే అని అంగద్ తెలిపాడు. ప్రెగ్నెన్సీ కారణంగా నేహ ని సినిమాల నుంచి తీసేసిన ప్రస్తుతం గురువారం డెరెక్టర్ బెహజాద్ ఖంబాట స్క్రీన్ పై గర్భిణీ పోలీసుగా తెరపై చూపించడానికి స్క్రిప్ట్ లో మార్పులు చేశారంటూ సంతోషం వ్యక్తం చేశారు అంగద్.