అమీర్ ఖాన్ యాడ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు?

బాలీవుడ్ సినిమాలు , వెబ్ సిరీస్ లను వివాదాస్పద కాన్సెప్టులు సీక్వెన్స్ లతో తెరకెక్కించే నేపథ్యంలో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు అడ్వటైజ్మెంట్ ఈ విషయంలో కూడా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది బాలీవుడ్. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే సున్నిత మైన అంశాలను టచ్ చేయడంతో సోషల్ మీడియా ద్వారా నెటిజన్ల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. ఇటీవలే వివాహ దుస్తులు అమ్మే బ్రాండ్ నటి ఆలియా భట్ తో తీసిన కన్యాదానం అడ్వటైజ్మెంట్ తీవ్ర విమర్శలు పాలైన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ వేడి చల్లారక ముందే బాలీవుడ్లో మరొక విషయం లో తీవ్ర దుమారం జరిగింది.

తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరో అమీర్ ఖాన్ యాక్ట్ చేసిన ఒక యాడ్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమీర్ ఖాన్ నటించిన సీయట్ టైర్ల కంపెనీ యాడ్ ఒకటి ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే రోడ్లు ఉంది టపాకులు పేల్చడానికి కాదు అంటూ తన ఎదురుగా ఉన్న జనాలకు క్లాస్ పీకుతూ సదరు టైర్ల యాడ్ ను ప్రమోట్ చేశారు అమీర్ ఖాన్.

ఈ యాడ్ చేయడం, తమ మతాన్ని కించపరిచే విధంగా ఉందంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఈ అభ్యంతరాలు కాస్త తారాస్థాయికి చేరి గా వేల ట్వీట్లు, రీట్వీట్లతో నింపుతున్నారు. ఈ యాడ్ చేసినందుకు నటుడు అమీర్ ఖాన్ క్షమాపణలు తెలపాలని, అలాగే ఈ ఆత్మ తొలగించాలని సీఎం కంపెనీని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.