సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలుగు సినీ పరిశ్రమ సమస్యలపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్నినాని, అనిల్ కుమార్ యాదవ్ వరుసగా ప్రెస్మీట్లు పెట్టి కౌంటర్లు ఇచ్చారు. ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అనిల్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్లైన్లో అమ్మితే పవన్ కళ్యాణ్ కి వచ్చే నష్టం ఏంటో చెప్పాలని అన్నారు.
తమకు సంపూర్ణేష్ బాబు అయినా..పవన్ కళ్యాణ్ అయినా ఒకటే అని మండిపడ్డారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై హీరో సంపూర్ణేష్ బాబు కూడా స్పందించారు. తనదైన శైలిలో టచ్ ఇస్తూ ట్వీట్ చేశాడు. తను పవన్ కళ్యాణ్ తో సమానంగా పోల్చడం పై సంతోషం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించి ఓ ట్వీట్ చేశాడు.
‘మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు మంచి మనసున్న మా పవన్ కళ్యాణ్ గారితో సమానంగా నన్ను చూడటం ఆనందకరం. ఏ సమస్య వచ్చినా పెద్ద మనసుతో స్పందించి తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు బాధలో ఉన్నారు. అదే పెద్ద మనసుతో అవి పరిష్కారం అయ్యేలా చూడగలరు.’ అని సంపూర్ణేష్ బాబు ట్వీట్ చేశారు. సంపూర్ణేష్ బాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
మంత్రి అనిల్ గారు,
మంచి మనసున్న మా పవన్ కళ్యాణ్ గారితో సమానంగా నన్ను చూడటం ఆనందకరం.
ఏ సమస్య వచ్చినా పెద్ద మనసుతో స్పందించే తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు బాధల్లో వున్నారు. అదే పెద్ద మనసుతో అవి పరిష్కారం అయ్యేలా చూడగలరు. https://t.co/q129GEb9xg— Sampoornesh Babu (@sampoornesh) September 26, 2021