శ్రీవారి సన్నిధిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు?

September 27, 2021 at 10:59 am

తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా మరొక పాన్ ఇండియా ప్రాజెక్టును మొదలు పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా దిల్ రాజు తిరుమల శ్రీవారిని దర్శించి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత పూజారులు తీర్ధ ప్రసాదాలను అందించి వారిని ఆశీర్వదించారు. దిల్ రాజు తో పాటుగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఆయన కుటుంబ సభ్యులు కూడా తిరుమల ను సందర్శించారు.

ఇకపోతే తమిళ స్టార్ హీరో విజయ్ తెలుగు లో డైరెక్ట్ తెలుగు సినిమా చేయబోతున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ భారీ స్థాయిలో నిర్మించనున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కథ సిద్ధం కాగా విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. తాజాగా ఈ సినిమాకు సంబంధించి దిల్ రాజు,వంశీ పైడిపల్లి,విజయ్ ముగ్గురు కలిసి ఉన్న ఫోటో ను రిలీజ్ చేయగా, ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళుతుందని అర్థం అవుతోంది. ఇక ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

శ్రీవారి సన్నిధిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts