లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శ్రుతి హాసన్.. తనదైన అందం, అభినయం, నటనతో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ సరసన `సలార్` చిత్రంలో నటిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రుతి ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్‌తో చిట్చాట్లు చేస్తుంటుంది. తాజాగా కూడా అభిమానులతో శ్రుతి ముచ్చట్లు పెట్టింది. ఈ చాట్ సెషన్లో తనకు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారని ప్రశ్నించాడు.
అందుకు శ్రుతి స్పందిస్తూ షాకింగ్ రిప్లై ఇచ్చింది. `నిజాయితీగా చెప్పాలంటే ఇప్పట్లో నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కరోనా పరిస్థితుల నుంచి బయటపడాలి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అడాగాల్సిన్న ప్రశ్నలూ చాలా ఉన్నాయి` అంటూ సమాధానం ఇచ్చింది. ఇక మరో నెటిజన్ సెక్స్ లేదా ఫుడ్.. ఈ రెండింటిలో మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తారని అడగడంతో.. ‘ఫుడ్ లేకపోతే మనం బతకలేం’ అని తెలిపింది.