మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ. మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కంచె బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ నటిస్తుంది. మరో హిరోయిన్‌గా పూర్ణ కనిపించనుంది.
అయితే పూర్ణ పాత్ర గురించి ఓ వార్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బాలయ్య భార్య పాత్రలో పూర్ణ కనిపించనుందట. కథలో ఒక కీలకమైన మలుపుగా వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో పూర్ణ కనిపిస్తుందట. సెకండాఫ్ లో వచ్చే పూర్ణ పాత్ర చాలా బాగుంటుందనీ.. సినిమాకు ఒక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
ఇక పూర్ణ పాత్ర నిడివి చిన్నదే అయినా, బాలకృష్ణ భార్య పాత్ర కావడం వల్ల..ఆమెకి మంచి పేరు తెస్తుందని, ఈ సినిమా తర్వాత ఆమె దశ తిరుగుతుందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.