టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. కామెడీ, ఎమోషనల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు కేరాఫ్‌గా నిలిచిన అనీల్ రావిపూడి.. ఈ సినిమాతో వింటేజ్ మెగాస్టార్‌ను మళ్లీ చూడబోతున్నారు అంటూ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసాడు. ఇక భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాపై.. మెగా అభిమానులతో పాటు సాధరణ ఆడియన్స్ లోను మంచి ఆసక్తి మొదలయింది. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ వివరాలు, కథలోని ఎమోషనల్ యాంగిల్ గురించి ఎన్నో టాపిక్స్ వైరల్ గా మారుతున్నాయి.
ఇక సెట్స్ పైకి రాకముందే ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొల్పిన ఈ సినిమా షూట్ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి రెమ్యూనరేషన్ ఎంతై ఉంటుంది అనే టాక్ ప్రజెంట్ హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం.. మన శంకర వరప్రసాద్ గారు సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి అక్షరాల రూ.72 కోట్ల రమ్యునరేషన్ అందుకుంటున్నాడట. గత కొన్నేళ్లుగా చిరంజీవి రెమ్యునరేషన్ అంతకంతకు పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం తన కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఛార్జ్ చేశాడట చిరు.

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్ రెమ్యూనరేషన్ రూ.60 నుంచి రూ.120 కోట్ల మధ్య ఉండగా.. చిరంజీవి స్థానం మరింత బలపడుతూ వస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక.. ఈ సినిమాకు మెగాస్టార్ పెద్ద కుమార్తె సుస్మిత కొండల ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుంది. నిర్మాతగా ఆమె స్టైల్, సెట్ డిజైనింగ్, ప్రొడక్షన్ క్వాలిటీ పై స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు టీం ఇప్పటికే వెల్లడించారు. ముఖ్యంగా సినిమాలో సుస్మితకు లాభాల్లో 50% వాటా ఉండనుందట. ఇక సినిమాలో ఆడియన్స్ కు ఆసక్తి కలిగించే మరో విషయం వెంకటేష్ కీలక పాత్రలో.. నయనతార హీరోయిన్గా మెరవడం. అంతేకాదు.. సినిమాకు రిలీజ్ టైం కూడా బాగా కలిసి రానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో అనీల్ ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అనుకుంటుందో చూడాలి.
