టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లు కేవలం తెలుగు ఆడియన్స్‌లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఇద్దరు స్టార్ హీరోలు గ్లోబల్ ఇమేజ్ సొంతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. త్వరలో మరోసారి వీళ్ళిద్దరి కాంబోలో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌ను ప్లాన్ చేస్తున్నారంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇంతకీ.. వీళ్ళిద్దరితో కలిసి ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నా డైరెక్టర్ మరెవరో కాదు.. నెల్సన్ దిలీప్ కుమార్. నిన్న మొన్నటి వరకు ఈ పేరు ఎవరికీ తెలియకపోయినా.. జైలర్ సక్సెస్‌తో ఒక్కసారిగా పేరు మోగిపోతుంది. కాగా.. ప్రస్తుతం జైలర్ 2 సినిమా పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్న నెల్సన్.. ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కొన్ని వార్తలు ప్రజెంట్ వైరల్ గా మారుతున్నాయి.
కొద్దిరోజుల క్రితం కోలీవుడ్‌లో మోస్ట్ పవర్ఫుల్‌గా కాంబో సెట్ చేసాడని టాక్ వైరల్ గా మారింది. కోలీవుడ్ లెజెండ్స్ అయినా రజనీకాంత్, కమలహాసన్ కాంబోలో సినిమాకు స్టోరీస్ సిద్ధం చేశారని టాక్ వినిపించడంతో.. ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ వచ్చాయి. ఇదే వాస్తవమైతే.. ఇది అన్ని సినిమాలో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌గా నిలుస్తుందని.. కచ్చితంగా రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే.. ఇప్పుడు కేవలం కోలీవుడ్ పై కాకుండా.. నెల్సన్ గ్లోబల్ లెవెల్ లో ఫోకస్ పెట్టాడట. ఈ క్రమంలోనే ఆర్‌ఆర్ఆర్ లాంటి హిస్టోరికల్ బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్, ఎన్టీఆర్‌లతో మల్టీ స్టారర్‌ను తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడు అంటూ టాక్ నడుస్తుంది. ఇప్పటికే.. చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ ఓ స్టారీ నరేట్ చేసాడని.. వాళ్లు కూడా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారని టాక్.. తమిళ్ వర్గాల్లో వైరల్ గా మారుతుంది.
వినడానికి ఆసక్తిని కల్పిస్తున్న.. ఒకేసారి రెండు బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌ను ఎలా ప్లాన్ చేస్తాడు.. అది కూడా అల్టిమేట్ కాంబోలను సెట్ చేసి.. సినిమాను తెరకెక్కించడం అంత సులువు కాదంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటివరకు జైలర్ 2 పూర్తి కాలేదు. మళ్ళీ వెంటనే ఈ రెండు ప్రాజెక్టులు ఎలా తీస్తాడని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక.. నెల్సన్ బహుశా ఎన్టీఆర్, చరణ్ లకు కథ వినిపించి ఉండొచ్చు కానీ.. ప్రాజెక్ట్ సర్టిఫికెట్ రావాలంటే చాలా సమయం పడుతుందని టాక్. అంతేకాదు.. ఫుల్ స్క్రిప్ట్ కంప్లీటూ.. ఇద్దరు ఒప్పుకుంటే గానీ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశాలు లేవు. ఒకవేళ ఇప్పటివరకు వినిపిస్తున్న ఈ రూమర్లే నిజమైతే మాత్రం కచ్చితంగా నెల్సన్ దశ తిరిగినట్టే. వీళ్ళ ముగ్గురి కాంబోలో సినిమా వచ్చిందంటే ఆడియన్స్‌లో అంచనాలు ఆర్‌ఆర్ఆర్‌ను మించిపోతాయి. ఈ క్రమంలోనే సినిమాకు బ్లాక్ బస్టర్ రికార్డులు క్రియేట్ అవుతాయంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

