ఫిలిమ్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్ మొదలవుతూనే ఉంటుంది. నిన్నమొన్నటి వరకు.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతి ఒక్క ఇండస్ట్రీలో హీరోలు, దర్శక, నిర్మాతలంతా పాన్ ఇండియన్ మంత్రాన్ని జపించుకుంటూ పోయారు. ఇప్పుడు పాన్ ఇండియా కాదు.. ఏకంగా సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్లాన్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా విదేశీ భాషల్లో సినిమాలతో సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అలా పాన్ వరల్డ్ రిలీజ్‌కు ప్లాన్ చేసినా.. టాలీవుడ్ సినిమాల లైనప్ సైతం ఆడియన్స్‌ను షాక్‌కు గురిచేస్తుంది. ఫారెన్‌లో తెలుగు సినిమాల రిలీజ్‌లు విదేశీ మార్కెట్‌పై ఫోకస్ ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇంతకీ అలా పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్న తెలుగు సినిమాల హీరోలు, దర్శక, నిర్మాతల లిస్ట్ ఏంటో ఆ సినిమాల పేర్లు ఏంటో ఒకసారి చూద్దాం.
కేవలం తెలుగు సినిమాలే కాదు.. బాలీవుడ్, కన్నడ లాంటి సినీ ఇండస్ట్రీలు కూడా హాలీవుడ్ మార్కెట్ పై దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ రామాయణం గ్లోబల్ లెవెల్లో రిలీజ్ చేసేందుకు టీం ప్లాన్ చేస్తున్నారు. రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను స్టార్ కాస్టింగ్ తో హాలీవుడ్ లెవెల్ లో విదేశీ ఆడియన్స్ సైతం ఆకట్టుకునేలా చూపించనున్నారట. పార్ట్ 1ని ఈ ఏడాది దీపావళిలో.. రామాయణం పార్ట్ 2పై వచ్చే ఏడాది దీపావళి రిలీజ్ చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే.. కన్నడ ఇండస్ట్రీ లో కాంతారా చాప్టర్ 1, యష్ టాక్సిక్ సినిమాలను సైతం పాన్ వరల్డ్ లో రిలీజ్ చేయనున్నారు. ఇందులో కాంతారా చాప్టర్ 1 అక్టోబర్ 2న.. టాక్సిక్ సినిమా వచ్చే ఏడాది మార్చి 19న రిలీజ్ కానున్నాయి.1 ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే..
SSMB 29 :
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమాళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబో SSMB 29 సంగతి తెలిసిందే. ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్స్ గా రూపొందుతున్న ఈ సినిమాను.. హాలీవుడ్ లెవెల్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 120 కి పైగా దేశాల్లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారట టీం. అంటే.. అవతార్, అవెంజర్స్ లాంటి దాదాపు 100 దేశాల్లో రిలీజ్ అయిన సినిమాలకు మించిపోయి SSMB29 రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే హాలీవుడ్ సినిమాలకు గట్టి పోటీ ఇచ్చేలా SSMB29 జక్కన్నను తీర్చిదిద్దుతున్నట్లు అర్థమవుతుంది. ఇక సినిమాకు మరో హైలెట్.. టైటానిక్, అవతార్ లాంటి మూవీస్‌ని డైరెక్ట్ చేసిన జేమ్స్ కామెరున్ చేతుల మీదుగా సినిమా రిలీజ్‌కు జక్కన్నను ప్లాన్ చేస్తున్నాడట. రిచ్ గ్లోబల్ స్థాయిలో ఉండేలా ఆయన ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. దాదాపు 20 కి పైగా భాషల్లో ఈ సినిమాను అనువదించనున్నట్లు టాక్. 2027 మార్చి 25న సినిమా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేయనున్నట్లు టాక్. అయితే.. ఈ రిలీజ్ డేట్, టైటిల్ డీటెయిల్స్ పై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.
స్పిరిట్:
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లోనే కాదు.. ఇతర దేశాల్లోనూ మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. అక్కడ ఆడియన్స్ సైతం ప్రభాస్ ను అమితంగా అభిమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇప్పటివరకు నటించిన పాన్ ఇండియా సినిమాలు బాహుబలి, కల్కి 2898 ఏడి సినిమాలు అక్కడ మంచి రిజల్ట్ అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డివంగా ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. యువీ క్రియేషన్స్, భద్రకాళి పిక్చర్స్, టీ – సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాను భారతీయ భాషలతో పాటు.. ఇంగ్లీష్, చైనా, జపాన్, కొరియన్ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. కాగా.. ఇంకా సినిమా సెట్స్‌పైకి రాలేదు. సినిమా సెట్స్‌పైకి వచ్చి షూట్ పూర్తి చేసుకుని రిలీజ్ టైంకి.. విదేశీ భాషలు అన్నిట్లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
డ్రాగన్:
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న డ్రాగన్ పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా ఉన్న ఈ సినిమాల్లో.. యాక్టర్ టోవినో థామస్ విలన్ గా కనిపించనున్నాడు. అయితే.. ఈ సినిమా అనౌన్స్మెంట్ టైంలో ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు మేకర్స్. దాదాపు 15 దేశాల్లో సినిమా షూట్ జరగనుందని.. ఇంటర్నేషనల్ లెవెల్ లో కనెక్ట్ అయ్యేలా ఓ ప్రపంచాన్ని ప్రశాంత్ నీల్ క్రియేట్ చేస్తున్నారంటూ టాక్ వైరల్ గా మారింది. అంతేకాదు.. సినిమా విదేశీ షూటింగ్ షెడ్యూల్ నవంబర్ నుంచి ప్రారంభమవుతుందట. ఇక లొకేషన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో సెలెక్ట్ చేసుకుని సినిమాలో ప్లాన్ చేస్తున్నారంటే.. ఇంటర్నేషనల్ లెవెల్ లో కచ్చితంగా సినిమా రిలీజ్ అవుతుందని అభిప్రాయాలు అందరి నుంచి వ్యక్తం అవుతున్నాయి. 2026 జూన్ 25న రిలీజ్ కానుంది. కాగా.. ఇప్పటికే ఎన్టీఆర్ ఆర్ఆర్ార్‌తో పాన్ ఇండియా లెవెల్ లోనే కాదు.. ఇతర దేశాల్లోనూ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అంటే ఆడియన్స్ లో మంచి హైప్ ఉంది.
పెద్ది:
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో సినిమాలకు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మంచి సక్సెస్ ఉంది. భాషా అర్థం కాకపోయినా.. గేమ్.. అందులోని స్ట్రాటజీ అందరికీ కనెక్ట్ అయిపోతుంది. ఈ క్రమంలోనే హిందీలో మేరీ కోమ్, బాగా మిల్క్ థింగ్ లాంటి సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా రిలీజై మంచి రిజల్ట్ అందుకున్నాయి. కేవలం హిందీ ఆడియన్స్ కాదు తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమాలను సూపర్ హిట్ గా నిలిపారు. ఈ క్రమంలోనే పెద్ది టీమ్ అయితే.. ఇప్పుడు ఇదే స్ట్రేటజిని వాడనున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పిరియాడికల్ మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా పెద్ది తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాను రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు టీం. అయితే.. సినిమాను గ్లోబల్ లెవెల్లో రిలీజ్ చేయాలని టీం భావిస్తున్నారట. మంచి ఎమోషన్స్ ఉన్న స్పోర్ట్స్ డ్రామా కనుక.. యూనివర్సల్ అపీల్ ఉంటుందని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రామ్ చరణ్ కు సైతం పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ క్రియేట్ అయింది. ఆర్‌ఆర్ఆర్‌లో చరణ్ పెర్ఫార్మెన్స్‌కు హాలీవుడ్ దర్శకులు సైతం.. ప్రశంసలు వర్షం కురిపించారు. ఇదే పెద్ది సినిమా ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ కు ఉపయోగపడుతుందని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం.
ఏఏ 22:
ఇప్పటికే పుష్ప ఫ్రాంచైజీ సినిమాలు పాన్ ఇండియా లెవెల్‌లోనే కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్‌లో మంచి సక్సెస్ సంపాదించుకున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్.. తమిళ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో భారీ బడ్జెట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సన్ పిక్చర్ సినిమా ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. ఈ మూవీని ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేస్తున్నారు. దీనికోసమే సన్నాహాలు సైతం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే హాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలకు మార్కెటింగ్ అసోసియేటివ్ గా వ్యవహరించిన కనెక్ట్ మాబ్ సీన్ తో అల్లు అర్జున్ అసోసియేట్ అయినట్లు సమాచారం, చర్చల భాగంగానే కనెక్ట్ మాబ్ సీన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ క్రియేటివ్ కంటెంట్ అలెగ్జాండ్రా.. తాజాగా ముంబై వచ్చి అల్లు అర్జున్ అండ్ అట్లీ టీం ను కలిసి మాట్లాడారు. త్వరలోనే సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో రిలీజ్ అని అఫీషియల్ ప్రకటన రానుందని సమాచారం. ఇక ఈ సినిమాను 2027 ఆగస్టులో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది
ది ప్యారడైజ్
దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాని హీరోగా శ్రీకాంత్ ఓద్దెల కాంబోలో వస్తున్న మూవీ ది ప్యారడైజ్. సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూసర్గ వ్యవహరిస్తున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది మార్చ్‌లో రిలీజ్ కానుంది. కాకపోతే.. పారడైజ్‌ను కొన్ని భారతీయ భాషలతో పాటు.. స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా వెల్లడించారు. అందుకు తగినట్లుగానే టాలీవుడ్ ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ కనెక్ట్ మాబ్ సీన్ సంస్థతో చర్చలు కూడా పూర్తయ్యాయట. అంతేకాదు.. ప్యారడైజ్ సినిమా.. ఇంటర్నేషనల్ వర్షన్ రిలీజ్ కోసం ఓ పాపులర్ హాలీవుడ్ యాక్టర్ తో కలవాలని మేకర్స్ భావిస్తున్నారు. దీనికోసం ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. త్వరలో ఈ ప్రాజెక్టుపై మరిన్ని విషయాలు రివీల్ కానున్నాయి. ఇంకొంతమంది టాలీవుడ్ హీరోలు తమ మార్కెట్ పరిధిలో గ్లోబల్ స్థాయిని పెంచుకునేందుకు ఇప్పటినుంచి ప్లాన్ చేసుకుంటున్నట్లు ఫిలిం వర్గాల్లో టాక్.