” OG ” మూవీ ప్రీమియర్ షో టాక్.. పవన్ ” తుఫాన్ ” షురూ..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు.. సాధారణ ఆడియ‌న్స్ అంతా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. ఎట్టకేలకు కొద్దిసేప‌టి క్రితం రిలీజ్ అపోయింది. నేడు గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా.. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్ షోస్ కూడా ముగించుకుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రిమియ‌ర్‌ షో టాక్‌ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. ఓవరాల్‌గా కథ‌ పాయింట్ ఏంటి.. సినిమా ఆడియన్స్‌ను ఏ రేంజ్ లో ఆకట్టుకుంది.. పవన్ తుఫాన్ షురూ నా.. కాదా.. చూద్దాం.

ముంబైలో పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్‌గా ఉండే హీరో.. ఫ్యామిలీ కోసం ముంబైని వదిలేసి వెళ్లిపోవడం.. తన వాళ్లకు కష్టం వచ్చిందని తెలిసి మళ్ళీ ముంబైకి రావ్వడం స్టోరీ. కోర్ పాయింట్ కామన్ గానే ఉన్న అందులో ఉపకథలు చాలా ఉన్నాయి. ఇక స్టోరీ రొటీన్‌గా అనిపించినా బ్యాక్ డ్రాప్‌ 1980స్ అయినా.. ఓవరాల్ మూవీ మాత్రం ఫ్యాన్స్ ని ఆకట్టుకోవడం ఖాయం అనిపిస్తుంది. సినిమాలో ఫ్యాన్స్ కోరుకునే రేంజ్ ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ చాలానే ఉన్నాయి.

ఓ అభిమానిగా సుజిత్ పవన్‌ని ప్రజెంట్ చేసిన తీరు నెక్స్ట్ లెవెల్‌లో ఉందని టాక్. కథ టేక్‌ఆఫ్ అవ్వడానికి కాస్త టైం తీసుకున్న.. పవన్ ఎంట్రీ నుంచి స్టోరీ స్పీడ్ పెరిగిందట. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అందరినీ ఆకట్టుకుంటాయని అంటున్నారు. ఇక కథ అక్కడక్కడ ల్యాగ్ అనిపించినా.. ఫ్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్ నార్మల్‌గానే ఉన్నా.. సినిమాకు ఇచ్చిన ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని.. పవన్ కెరీర్‌లోనే ది బెస్ట్ అనిపించే రేంజ్ లో పవన్‌ను చూపించారని అంటున్నారు. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే మైండ్ బ్లాక్ అయ్యే లెవెల్లో.. థ‌మన్ అదరగొట్టాడని సినిమాకు ఇది అతి పెద్ద ప్లస్ అని టాక్.

ఇక.. ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా అనిపించినా.. సెకండ్ బాగానే నడిచిందని చెప్తున్నారు. ఓవరాల్ గా సినిమా యావరేజ్ టు య‌బ్బో యావరేజ్ రేంజ్ లో ఉందట‌. ఓవరాల్‌గా.. బిగ్‌ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమాకు వెళితే.. కచ్చితంగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని.. పవన్ ఫ్యాన్స్ ధియేటర్లకు వెళ్లి చూడాల్సిన సినిమా.. సాదరణ ఆడియన్స్ సైతం ఒకసారి థియేటర్లో చూడొచ్చు అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా ఫస్ట్ షో ముగిసిన తర్వాత ఆడియన్స్ రివ్యూ ఎలా ఉంటుందో.. ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. ఇక‌ సినిమాకు ప్రజెంట్ ఉన్న హైప్, హాలిడే సీజన్, టికెట్లు హైక్, ఎక్కువగా థియేటర్లు కేటాయించడం.. ఇవని సినిమాకు కలిసొచ్చాయి. దీంతో సినిమా బ్రేక్ ఈవెన్ సులువంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.