మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న ఆయన ఏడు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. తన అందం, ఫిట్నెస్, డ్యాన్స్ గ్రేస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే వరుస సినిమాల లైనప్‌తో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇక ప్రస్తుతం చిరు చేతిలో ఉన్న ప్రాజెక్టులో మోస్ట్ అవైటెడ్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు అనడంలో అతిశయోక్తి లేదు. అనీల్ రావిపూడి డైరెక్షన్‌లో ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇక అనీల్ రావిపూడి సినిమా గురించి చేస్తున్న కామెంట్స్ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంతకంతకు అంచనాలను పెంచుకుంటూ పోతున్నాయి. ఇలాంటి క్రమంలో మెగా ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా సంక్రాంతి రేస్ నుంచి తప్పకుండా అంటూ వార్తలు తెగ వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకు సినీ కార్మికుల సమ్మె టాలీవుడ్‌లో సంచలనగా మారింది. ఈ క్రమంలోనే సినిమాల షూటింగ్‌లకు కూడా అంతరాయం కలిగింది. అలా మెగా 157కు కూడా భారీ ఎఫెక్ట్ పడిందని.. సినిమా షూట్ చాలా వరకు ఆగిపోయిందని.. దీంతో సంక్రాంతి మూవీ రిలీజ్ కష్టమేనని వార్తలు తెగ వైరల్ గా మారాయి.
ఇక తాజాగా ఈ మూవీ నిర్మాత సాహు గారపాటి ఓ ఈవెంట్లో మాట్లాడుతూ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈ సమ్మె కారణంగా దాదాపు 15 రోజుల షూట్‌కు అంతరాయం కలిగిందని.. ఆయినా సంక్రాంతికి కచ్చితంగా సినిమా వచ్చేలా చూసుకుంటాం. ఆర్టీస్ట్‌లు, టెక్నీషియన్స్ అందరూ ప్రస్తుతం పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. కొత్త స్కేడ్యులను శరవేగంగా చేస్తున్నాం. నవంబర్ 15 లోపు షూట్ కంప్లీట్ చేసి పోస్టు ప్రొడక్షన్ పనులు వీలైనంత త్వరగా ముగించి సంక్రాంతికే సినిమాను రిలీజ్ చేస్తామంటూ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం సాహు ఘారపాటి చేసిన కామెంట్స్ ఫ్యాన్స్‌లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. హమ్మయ్య ఎలాగైనా మా చిరు అన్న సినిమా ఆగకుండా రిలీజ్ అయితే చాలని అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.