ఆగష్ 14న పాన్ ఇండియా లెవెల్లో రెండు భారీ సినిమాలు పోటీకి సిద్ధమవుతున్నాయి. ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమా కాగా.. మరొకటి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ 2. ఇక కూలీ మూవీలో నాగార్జున, అమీర్‌ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్ కాస్టింగ్ మెరవనున్నారు. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ రూపోందించగా.. యష్ రాజ్ ఫిలిమ్స్ పై యూనివర్స్ భాగంగా వార్ 2 రూపొందింది. ఇక వార్ 2 ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకోగా.. కూలీ ట్రైలర్ నిన్ననే రిలీజ్ అయింది. ఈ క్రమంలోనే రెండు ట్రైలర్ల మధ్య పోటీ మొదలైంది. రెండు ట్రైలర్ ఏది బాగుంది.. ఎవరు విన్నర్ అనే అంశం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
వార్ 2 ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది యాక్షన్ ఫీస్ గా మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. హృతిక్ రోషన్ బాడీ లాంగ్వేజ్ తో పాటు.. తారక్ యాక్షన్ లాంగ్వేజ్ ఆడియన్స్‌ను మెప్పించాయి, ఆకాశంలో విమానంపై తారక్ చేసిన యాక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ట్రెండ్ అయ్యాయి. కియారా, హృతిక్ రోషన్ మధ్యన రొమాన్స్.. ఎన్టీఆర్, హృతిక్ మధ్యన ఫేస్ టు ఫేస్ వార్ సస్పెన్స్ కంటెంట్ అన్ని ట్రైలర్ కట్‌లో అదిరిపోయేలా చూపించారు. ఈ మూవీ కథలో సస్పెన్స్‌ను మెయిన్టైన్ చేస్తూ.. ట్రైలర్ మెప్పించింది. ఇక కూలి విషయానికి వస్తే.. మూడు నిమిషాల ట్రైలర్ కట్‌ను రిలీజ్ చేశారు.
ఇందులో పాత్రలను పరిచయం చేయడానికి ఎక్కువ సమయం ఇచ్చారు. స్టోరీ కంటెంట్ రిలీజ్ చేయకుండా ట్రైలర్ పూర్తి చేసేసాడు. కేవలం పాత్రల పరిచయలతో పాటు.. రెండే రెండు యాక్షన్ సీన్స్ తో ట్రైలర్ను ముగించాడు. అసలు కథ గురించి మెయిన్ గా చెప్పకుండా పాత్రల్లో హైప్ పెంచే దిశగా దృష్టి పెట్టాడు లోకేష్. అదే ట్రైలర్ కు మైనస్ అయిందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజువల్ పరంగా ఆకట్టుకున్నా.. రజిని లుక్, మిగతా పాత్రలు, యాక్షన్ మెప్పించిన కథ కోణం ఏంటో తెలియకుండా మిస్ చేశారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అలా.. ప్రస్తుతం వార్ 2 కూలీ ట్రైలర్ కట్‌లలో వార్ 2 ఆడియన్స్‌ను ఎక్కువగా ఆకట్టుకుందని చెప్తున్నారు.