” వీరమల్లు ” ఓవర్సీస్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. డిస్ట్రిబ్యూటర్స్ సెన్సేషనల్ అనౌన్స్మెంట్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయ్యింది. మరో 11 రోజుల్లో ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కారుంది. జులై 24న ఆడియన్స్‌ను పలకరించనున్న ఈ సినిమాపై.. సినిమా ప్రారంభంలో భారీ అంచనాలే ఉండేవి. కానీ.. సినిమా ఆలస్యం అవుతున్న కొద్ది ఆడియన్స్‌లో హైప్‌ కూడా తగ్గుతూ వచ్చింది. ఇలాంటి క్రమంలో తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన థియేట్రిక‌ల్‌ ట్రైలర్ ఒక్కసారిగా ఆడియన్స్ లో హైప్ ను పెంచి.. నూతనుత్సాహాన్ని నింపింది. సినిమా ఎంత లేట్ అయినా కచ్చితంగా క్వాలిటీ మిస్ కాకుండా ఆడియన్స్ను పలకరిస్తుందని క్లారిటీ వచ్చింది. సరిగ్గా ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేస్తే సినిమాకు బ్లాక్ బస్టర్ రిజల్ట్ పక్క అంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అయితే.. ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ త‌గ్గ‌ట్టు ప్ర‌మోష‌న్స్ మాత్రం ఇంకా జరగడం లేదు. కాగా.. ఈ నెల 15 నుంచి నాన్ స్టాప్ ప్రమోషన్స్‌లో మేకర్స్ సందడి చేయనున్నారని టాక్. ఇక.. ఈ క్రమంలోనే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ నాలుగు రోజుల క్రితమే గ్రాండ్ లెవెల్‌లో మొదలయ్యాయి. ఈ బుకింగ్స్‌లో లక్ష డాలర్లకు పైగా గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్ట‌గా.. రీసెంట్ పాన్ ఇండియన్ సినిమాలతో పోలిస్తే వీరమల్లు సినిమా చాలా తక్కువ రేట్ లో బిజినెస్ జరిపిందని చెప్పాలి. భవిష్యత్తులో అత్యధిక షోస్ షెడ్యూల్ చేస్తారు కనుక.. మంచి గ్రాస్ వెసుళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే.. పవన్ రేంజ్‌కు తగ్గట్టు ఆల్ టైం రికార్డ్‌ను మాత్రం ఈ సినిమాలో మర్చిపోక తప్పదు. కారణం.. రీసెంట్గా పాన్ ఇండియన్ సినిమాలన్నీ ఫార్మల్ స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుండ‌గా.. భారీ బడ్జెట్ తో తీసినవి ఐమాక్స్, ఈ బ్గాక్స్, డాల్బీ, 4dx, ఫార్మిక్స్ లో కన్వర్ట్ చేసి రిలీజ్ చేస్తూ వస్తున్నారు.

ఈ స్క్రీన్ పై సినిమాలు చూసేందుకు జనాలు సైతం ఆసక్తి చూప్తున్నారు. కానీ.. వీరమల్లు సినిమాకు ఈ ఫార్మాట్లో సినిమా రిలీజ్ ఉండదని నార్త్‌ డిస్ట్రిబ్యూటర్లు తాజాగా.. అఫీషియల్‌గా ప్రకటించారు. కారణం.. సూపర్ మాన్, ఫెంటాస్టిక్ 4 లాంటి భారీ హాలీవుడ్ సినిమాలు సైతం అదే సమయంలో రిలీజ్ కావడం. థియేటర్స్ మొత్తం ఈ సినిమాలకు కేటాయించడం వల్ల.. పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమా ఎంత పాన్ ఇండియన్ సినిమా అయినా.. ఈ ఫార్మాట్‌లో రిలీజ్ చేయడం కుదరట్లేదు అని డిస్ట్రిబ్యూటర్లు వివరించారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎంత భారీగా తీశారో క్లారిటీ వస్తుంది. కానీ.. సినిమాలు ఆరెంజ్ విజువల్స్ తో క్లారిటీతో చూడడానికి థియేటర్లలో కుదరకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదే సినిమాను జూన్ 12న అన్ని విధాలుగా పర్ఫెక్ట్ ఉండేది కదా అన్ని.. ఫార్మాట్ స్క్రీన్ సినిమాకు దక్కేవి కదా అంటూ సోషల్ మీడియాలో నిర్మాతను ట్యాగ్ చేస్తూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.